తమిళ సూపర్ స్టార్ సూర్య, పూజా హెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రెట్రో (Retro Review). కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై కార్తీకేయన్ సంతానం, సూర్య, జ్యోతిక నిర్మాతలుగా మారి నిర్మించారు.
తమిళంలో పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయరాం, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. రెట్రో సినిమాకు రిలీజ్ తర్వాత తొలుత మిక్స్‌డ్ టాక్.. ఆ తర్వాత డిజాస్టర్ టాక్ వచ్చింది.
సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ పైన ఉండే క్రేజ్ కారణంగా మొదట కలెక్షన్స్ బాగున్నా..తర్వాత పూర్తిగా డ్రాప్ అయ్యిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఎదురైన పెద్ద అవమానం ఏమిటంటే..ఈ చిత్రం బడ్జెట్ లో పావు వంతుతో రూపొందిన చిత్రం ఈ సినిమా కలెక్షన్స్ ని దాటేసి దూసుకుపోవటం.
తమిళనాడులో రెట్రో చిత్రం సుమారు 50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినప్పటికీ, ఇప్పుడు ఆ రికార్డుని ఓ చిన్న బడ్జెట్ చిత్రం దాటి పోయేలా కనిపిస్తోంది. ఆ సినిమానే ‘టూరిస్టు ఫ్యామిలీ’.
శశికుమార్, సిమ్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, రెట్రో సినిమాతో పోటీగా థియేటర్లలోకి వచ్చింది. అయితే, రిలీజైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటూ… బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోయింది.
ఈ వారాంతానికే ఈ సినిమా 40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫైనల్ రన్‌లో తమిళనాడులో రేట్రో వసూళ్లను మించిన చాన్స్ ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ‘టూరిస్టు ఫ్యామిలీ’ – ‘రెట్రో’ వసూళ్లను దాటేసింది. దీనితో ప్రేక్షకులే కాకుండా ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఓ డిస్ట్రిబ్యూటర్… “మా ప్రాంతంలో ‘టూరిస్టు ఫ్యామిలీ’ వసూళ్లు ‘రెట్రో’ కంటే ఎక్కువగా వచ్చాయి” అని ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీంతో ‘రెట్రో’ టీమ్‌కి ఇది డైరక్ట్ గా అవమానంగా మారింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ ఓ చిన్న చిత్రం ముందు తేలిపోయింది.