
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అంటే అభిమానులకి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. స్కిన్ షో చేయకుండా, కేవలం నటనతోనే కోట్లాది మందిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల ఓ బీచ్ వెకేషన్ ఫొటోలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది.
బీచ్‌లో చెల్లెలు పూజా కన్నన్‌తో కలిసి రిలాక్స్ అవుతూ పంచుకున్న పిక్స్‌లో సాయి పల్లవి స్విమ్‌సూట్‌లో కనిపించడం కొంతమంది అభిమానులను ఆనందపరిచినా, మరికొందరిని రెచ్చగొట్టింది. కొంతమంది ఫ్యాన్స్ “అయ్యో ఎంత క్యూట్‌గా ఉంది” అంటూ మెచ్చుకోగా, మరోవైపు కొంతమంది నెటిజన్లు మాత్రం “సీతమ్మ పాత్రలో నటిస్తున్న నటి ఇలాంటివి ఎలా చేస్తుంది?” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

యష్ – రణబీర్ కపూర్‌ల వంటి స్టార్స్ తో భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుండటం, ఈ వివాదానికి మరింత బలం చేకూర్చింది. స్క్రీన్‌పై దేవీ రూపంలో కనిపించే నటి, ఆఫ్ స్క్రీన్‌లో ఇలావుండటం సరైనదేనా అన్న కోణంలో ట్రోల్స్ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే బాయ్ కాట్ సాయి పల్లవి అనే ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. దీని పై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో చూడాలి.
అయితే, మరోవైపు ఫ్యాన్స్ మాత్రం గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు –
“సినిమాలో చేసే పాత్రలు, వ్యక్తిగత జీవితం వేరువేరు. ఒక నటి ఏ పాత్ర చేసినా, ఆమె వ్యక్తిగత ఫ్యాషన్ లేదా లైఫ్‌స్టైల్‌తో లింక్ పెట్టడం తగదు.”
“సాయి పల్లవి ఏ పాత్ర చేసినా అది ఆమె నటన ఆధారంగా నిలుస్తుంది. వ్యక్తిగతంగా ఆమె ఏం వేసుకుంటుంది అనేది పూర్తిగా ఆమె హక్కు.”

ఈ వివాదం మరోసారి సోషల్ మీడియా “రీల్ – రియల్ కన్ఫ్యూషన్” ఎంత పెద్ద సమస్యో చూపించింది. భారతీయ ప్రేక్షకుల్లో నటుల వ్యక్తిగత జీవితం, వారు తెరపై పోషించే పాత్రలతో కలిపి చూడటం చాలా సాధారణం. ముఖ్యంగా రామాయణం, మహాభారతం లాంటి పురాణ ఇతిహాసాల్లోని పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో గౌరవస్థానంలో ఉండటం వల్ల, అలాంటి పాత్రలు చేసే నటుల ప్రైవేట్ లైఫ్ కూడా జడ్జ్ చేయబడుతోంది.
ఏదైమైనా ఒక నటి స్విమ్‌సూట్ వేసుకోవడం వల్ల ఆమె నటన లేదా ఆ పాత్ర పవిత్రత ఏమైనా తగ్గిపోతుందా? సమాధానం స్పష్టమే… కాదు. కానీ సోషల్ మీడియాలో ఈ పోలికలు, ఈ ద్వంద్వ ధోరణి ట్రోల్స్‌కు ఎప్పుడూ ఒక ఛాన్స్ ఉంటూనే ఉంటుంది.
