సినిమా వార్తలు

సల్మాన్ ఖాన్–దిల్ రాజు షాకింగ్ డీల్: ఈ డీల్ వెనుక అసలు కథేమిటి!

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మళ్లీ బాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ‘HIT’, ‘Jersey’ రీమేక్‌ల తర్వాత కొద్దిరోజులుగా నిశ్శబ్దంగా ఉన్న ఆయన… ఇప్పుడు డబుల్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నారు. అమీర్ ఖాన్‌తో ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన వంశీ పైడిపల్లి, లేటెస్ట్‌గా సల్మాన్ ఖాన్‌కి స్టోరి నేరేట్ చేశారని టాక్. బిగ్ న్యూస్ ఏంటంటే… సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట!

₹100+ కోట్ల రెమ్యూనరేషన్ ఎక్కడ? సల్మాన్ కొత్త డీల్ ఇదే!

సల్మాన్‌కు ముందే అడ్వాన్స్ ఇచ్చిన దిల్ రాజు… ఈసారి పూర్తిగా డిఫరెంట్ ప్రపోజల్ ఇచ్చారట. భారీ రెమ్యూనరేషన్ కాకుండా, చిన్న ఫిక్స్ అమౌంట్ + ప్రాఫిట్ షేరింగ్ మోడల్. అంటే సినిమా హిట్ అయితే, సల్మాన్‌కు ఎక్స్‌ట్రీమ్ బెనిఫిట్స్! బాలీవుడ్‌లో స్టార్‌లు తీసుకునే భారీ చెక్కులపై… ఇది నూతన ట్రెండ్ అవుతుందా? అన్నదే ఇండస్ట్రీ టాక్.

షూట్ ఎప్పటి నుంచంటే?

2025లో షూటింగ్ స్టార్ట్, ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో. కాస్ట్ క్రూ లాక్ అయిన వెంటనే పబ్లిక్ చేస్తారట.

దిల్ రాజు మరో షాక్: ఈ తెలుగు కథ కూడా హిందీకి?
ఇంతకే కాదు… దిల్ రాజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ని కూడా హిందీ లో రీమేక్స్ చేయాలనే డిసిషన్ తీసుకున్నారట. అదే వచ్చే ఏడాదిలో సెట్ అవుతుందన్న బజ్.

సల్మాన్–దిల్ రాజు డీల్… బాలీవుడ్ పేమెంట్ స్ట్రక్చర్ ను షేక్ చేయనుందా?
అమీర్ ప్లాన్ డ్రాప్… సల్మాన్ ఎంట్రీ: గేమ్ రివర్స్ అవుతుందా?

మొత్తానికి… టాలీవుడ్–బాలీవుడ్ కలయికలో కొత్త చరిత్ర రాయడానికి దిల్ రాజు సిద్ధం అయినట్టుగా కనిపిస్తోంది!

Similar Posts