తెలుగు ప్రేక్షకుల్లో సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “ఓ బేబీ”, మొదలుకొని “శాకుంతలం” వరకూ ఆమె సినిమాలు భిన్నంగా ఆలోచించే ప్రయత్నంగా నిలిచాయి. కానీ గత కొన్ని కాలంగా ఆమె తెరపై నిశ్శబ్దంగా మారిపోయింది. వ్యక్తిగత కారణాలతో పాటు, కెరీర్‌ పరంగా కూడా సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో గ్యాప్ అనివార్యమైంది.

ఇంతలోనే పలు చిత్రాలకు సంబంధించి ఆమె పేరు వినిపించినా, అవేవీ అధికారికంగా ఫైనల్ కాలేదు. “ఉస్తాద్ భగత్‌సింగ్” వంటి పెద్ద చిత్రానికి ఆమెను తీసుకోవాలనే ఆలోచన ఉన్నా, చివరకు ఆ ఛాన్స్ రాశీ ఖన్నాకు వెళ్లింది.

ఇప్పుడు ఎట్టకేలకు సమంత తెలుగులో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను అంగీకరించినట్లు సమాచారం. దర్శకురాలు నందినిరెడ్డి తెరకెక్కించే ఓ కొత్త కథలో సమంత నటించబోతోందట. ‘అన్నీ మంచి శకునములే’ తర్వాత గ్యాప్ తీసుకున్న నందిని, ఇటీవల కొన్ని కథలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వాటిలో ఒకదాన్ని సమంతకి వినిపించగా, ఆ కథపై ఆమె ఓకే చెప్పడమే కాకుండా తన సొంత బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మించాలనే నిర్ణయం తీసుకుందట.

ఇటీవ‌లే సమంత నిర్మాతగా తీసిన ‘శుభం’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఫైనాన్షియల్‌గా మాత్రం ఆమెకు లాభాలే వచ్చాయట. అదే ఉత్సాహంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌ను కూడా చిన్న బడ్జెట్‌లో, కంటెంట్ ఆధారితంగా ప్లాన్ చేస్తున్నారు.

ఇదివరకు సమంత–నందినిరెడ్డి కాంబోలో వచ్చిన “ఓ బేబీ” భారీ హిట్ కావడం, ఇప్పుడు మరో సారి ఇద్దరూ కలిసి పని చేయడం విశేషం. నటిగా, నిర్మాతగా సమంతకు ఈ సినిమా తిరిగి తెలుగులో మళ్లీ వరస ఆఫర్స్ కు ఎంట్రీ గా కనిపిస్తోంది.

,
You may also like
Latest Posts from