
శంకర్ మైండ్ బ్లోయింగ్ డెసిషన్! ‘ఇండియన్ 3’కి గుడ్‌బై… డైరెక్ట్‌గా డ్రీమ్ ప్రాజెక్ట్‌లోకి జంప్!
సౌత్ సినిమా ప్రేక్షకులకే కాదు, మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు డైరెక్టర్ శంకర్. ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ వరుసగా డిజాస్టర్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత, శంకర్ కెరీర్‌లో ఇంత పెద్ద మలుపు వస్తుందని ఎవరూ ఊహించలేదు. “శంకర్ రీ-ఇంట్రిని ఎవరు ఆపలేరు!” అని చెప్పేలా ఇప్పుడు ఆయన ఓ భారీ నిర్ణయం తీసుకున్నారు.
ఇండియన్ 3 క్లోజ్… శంకర్ ఎందుకు వెనక్కి తగ్గాడు?
కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ ఇదే — శంకర్ పూర్తయిన Indian 3 షెడ్యూల్‌లను పక్కన పెట్టేసాడట! ఇప్పటికే ఇండియన్ 3లో చాలా భాగం షూట్ చేసారు. కానీ కమల్ హాసన్ కూడా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లడానికి ఆసక్తి చూపలేదని టాక్. బాక్సాఫీస్ వద్ద ఇండియన్ 2 పేలిపోకపోవడం… క్రేజ్, బజ్ అట్టడుగు స్థాయికి పడిపోవడం… ఈ కారణాలన్నీ కలిపి ప్రాజెక్ట్‌ను వదిలేసేలా చేసాయట. దాంతో “ఇండియన్ 3 ఇక జరగదు” అనే న్యూస్ కోలీవుడ్‌లో రౌండ్లు కొడుతోంది.
శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’ స్టార్ట్! – ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో
ఇండియన్ 3 నిలిపేయగానే, శంకర్ ఏం చేస్తున్నారు? అసలు సెన్సేషనల్ పార్ట్! అందరి ఎదురుచూపుల మధ్య శంకర్ స్ట్రాంగ్ గా పట్టుకున్న ప్రాజెక్ట్:
‘వేల్పారి’ – తమిళ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక కథ!
ఇదో మైథలాజికల్ పిరియడ్ డ్రామా. అత్యంత పాపులర్ తమిళ చారిత్రక నవల ఆధారంగా రెడీ అవుతోంది. శంకర్ చెబుతున్న మాటల ప్రకారం:
“ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో, బడ్జెట్ పరంగా నా కెరీర్‌లోనే అతిపెద్ద సినిమా!”. టెక్నికల్‌గా గ్రాండ్ విజువల్స్, భారీ సెట్స్, హాలీవుడ్ రేంజ్ CG – ఇవన్నీ ప్లాన్‌లో ఉన్నాయట. ఇదే శంకర్ కంబ్యాక్ సినిమా అవుతుంది అన్న నమ్మకంతో ముందుకు వెళ్తున్నారట.
హీరో ఎవరు? – టాప్ తమిళ స్టార్ రేసులో!
శంకర్ ఇప్పటిదాకా హీరొను ఫైనల్ చేయలేదని సమాచారం. కానీ… ఒక టాప్ తమిళ స్టార్‌తో నెగోషియేషన్లు జరుగుతున్నాయట.
కోలీవుడ్‌లో హాట్ డిబేట్:
“వేల్పారి హీరో తళపతి విజయ్ ? లేక మరెవరో?” అధికారిక అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఏదైమైనా వేల్పారి స్టార్ట్ – శంకర్ కెరీర్‌ను మళ్లీ రీడిఫైన్ చేసే నిర్ణయం. అతి భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ స్కేల్ – ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశమంటున్నాయి. శంకర్ తిరిగి వస్తున్నాడు… కానీ ఈసారి మరింత పెద్దగా! అనేది ఇండస్ట్రీ మాట.
