సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ తాజాగా ఓ అవార్డ్ ల కార్యక్రమంలో చేసిన మాటలు ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తాను చేయబోయే సినిమాల పై, తానూ కనిపించే పాత్రల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే అదే సమయంలో ఓ సీనియర్ హీరోయిన్ పై పరోక్షంగా కామెంట్స్ చేసారు. అసలు ఏమైంది. సిమ్రాన్ ఏమన్నారో చూద్దాం.
తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సిమ్రాన్ స్టేజ్‌పై మాట్లాడుతూ.. ‘కొన్నిరోజుల క్రితం నాకు బాగా తెలిసిన తోటి నటికి ఓ మెసేజ్ పంపించాను. ఆమె నటించిన ఓ సినిమాని ఉద్దేశించి అందులో రాసుకొచ్చాను. ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుందని.. ఆ రోల్ చూసి ఆశ్చర్యపోయానని మెసేజ్ పంపాను. దానికి ఆమె వెంటనే స్పందించింది. ఆంటీ రోల్స్‌లో నటించడం కంటే ఇది ఎంతో ఉత్తమం అంటూ నాకు సమాధానంగా ఆమె మెసేజ్ పంపింది’ అని సిమ్రాన్ తెలిపింది.
సిమ్రాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే ఆమె పంపిన మెసేజ్ నన్ను ఒకింత షాక్‌కు గురి చేసింది. ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్లు అనిపించింది. ఈ వేదికగా ఆమెకు నేను చెప్పేది ఒక్కటే. పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే, ఆంటీ లేదా అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమం. ఏ వర్క్ చేసినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి’ అంటూ సిమ్రాన్ తెలిపింది.
అయితే సిమ్రాన్ మాట్లాడింది ఎవరిని ఉద్దేశించి అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే తమిళ సినిమా వర్గాలు చెప్పేదాని ప్రకారం సిమ్రాన్ …మరెవరో కాదు జ్యోతికను ఉద్దేశించి అలాంటి కామెంట్ చేసిందని చెప్తున్నారు. జ్యోతిక చేసిన కొన్ని పాత్రలు ఈ మధ్యన ఊరు,పేరు లేకుండా పోయాయి. వాటని గురించే అయ్యిండవచ్చు అనేది తమిళ సినిమా వర్గాల టాక్.
ఇక ఇటీవల విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో సిమ్రన్ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు.