తమకు ఇష్టం లేకుండా కొన్ని సినిమాలు చేయాల్సివస్తుంది నటులకు. అయితే కొంతకాలం అయ్యాక రిగ్రెట్ అవుతూంటారు వాళ్లు. అయితే ఆ విషయం బహిరంగంగా చెప్పరు. పర్శనల్ గా తన సన్నిహితులతో ఆ ఆవేదనను షేర్ చేసుకుంటారు. అయితే ప్రియదర్శి మాత్రం ధైర్యంగా ఓ ఇంటర్వూలో తనకు ఇష్టం లేకుండా ఓ చెత్త సినిమా చేసేసానని చెప్పేసాడు. ఆ సినిమా ఏమిటి.
ప్రియదర్శి మాట్లాడుతూ… ‘నేను చాలా రోజులుగా కామెడీ సినిమాలు కాకుండా యాక్టింగ్ పరమైన పాత్రలు చేయాలని చూస్తున్నాను. కోర్టు సినిమా నేను నా లైఫ్ లో తీసుకున్న బెస్ట్ నిర్ణయం. మిఠాయి సినిమా చేయడం నా కెరీర్ లోనే చెత్త నిర్ణయం. ఇప్పుడిప్పుడే నాకు ఎలాంటి సినిమాలు చేయాలి అనే దానిపై క్లారిటీ వస్తోంది.’ అంటూ చెప్పుకొచ్చారు ప్రియదర్శి.
అలాగే ‘నా కెరీర్ లో ఎన్నడూ కమెడియన్ అవుతానని అనుకోలేదు. ఎందుకంటే నేను కమెడియన్ అవుదామని ఇండస్ట్రీలోకి రాలేదు. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్ లాంటి వారిని చూసి వాళ్ల లాగా యాక్టింగ్ చేద్దామని వచ్చాను.. ఇన్నేళ్ల కెరీర్ లో అలాంటి పాత్రలు నాకు ఇంకా రాలేదు. అందుకే చాలా అసంతృప్తిగా ఉంది’ అంటూ తెలిపారు.
మిఠాయి సినిమా విషయానికి వస్తే…నూతన దర్శకుడు ప్రశాంత్ కుమార్ ప్రముఖ కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన డార్క్ కామెడీ సినిమా ‘మిఠాయి’. తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించారు. నాసిరకమైన సన్నివేశాలు, అర్థంపర్ధం లేని కథ, ఆకట్టుకోలని కథనం ప్రేక్షకుడి సహానానికి పరీక్ష పెడుతాయి. కథ లాగిపట్టి సాగదీస్తూ వెళ్లడం ప్రేక్షకుడికి అగ్ని పరీక్షగా మారుతుంది. సంప్రదాయ సినిమా మేకింగ్ ఆమడ దూరంగా సినిమా ఉండటం ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది.