పుష్ప 2’ త‌ర్వాత సుకుమార్ రైటింగ్స్‌తో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన చిన్న చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న‌య సుకృతివేణి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారి కావ‌డంతో సినిమా మ‌రింత ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. ‘గాంధీ తాత చెట్టు’ ఇటీవల మంచి బజ్‌తో రిలీజ్ అయ్యింది.

జనవరి 24న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్సిడ్ రెస్పాన్స్ లభించింది. పలువురు స్టార్ హీరోలు ఈ సినిమాను ప్రమోట్ కూడా చేశారు. అయితే, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు.

ఇప్పుడు ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘గాంధీ తాత చెట్టు’ చిత్రం నేటి(మార్చి 21) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. పద్మావతి మల్లాది డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఓ చక్కటి మెసేజ్‌ను కలిగి ఉండటంతో థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తారని మేకర్స్ చెబుతున్నారు.

క‌థేంటంటే: నిజామాబాద్ జిల్లా అడ్లూర్‌లో జ‌రిగే క‌థ ఇది. గాంధీ మ‌హాత్ముడి గుర్తుగా త‌న తండ్రితో క‌లిసి పొలంలో ఓ చెట్టు నాటుతాడు రామ‌చంద్ర‌య్య (ఆనంద చ‌క్ర‌పాణి). ఎప్పుడూ ఆ చెట్టు చెంత‌నే గ‌డుపుతూ, అందులోనే త‌న ప్రాణం ఉంద‌ని చెబుతుంటాడు. గాంధీ సిద్ధాంతాల్ని న‌మ్మి అనుస‌రించే ఆయ‌న… త‌న మ‌న‌వ‌రాలికి గాంధీ (సుకృతివేణి) అని పేరు పెడ‌తాడు.

పేరే కాదు, గాంధీ సిద్ధాంతాల్ని బోధిస్తూ పెంచుతాడు. (gandhi tatha chettu movie review) ఊరిలోనూ, కుటుంబంలోనూ చోటు చేసుకున్న ప‌రిణామాల కార‌ణంగా రామ‌చంద్ర‌య్య త‌న భూమికి, చెట్టుకు దూర‌మ‌య్యే ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి.

త‌న తాత ప్రాణ‌ప్ర‌దంగా భావించే చెట్టుని కాపాడేందుకు చిన్నారి గాంధీ ఏం చేసింది? త‌న తాత బోధించిన గాంధీజీ సిద్ధాంతాల‌తో ఆమె శాంతియుతంగా చేసిన పోరాటం ఎలాంటి ఫ‌లితాన్నిచ్చింద‌న్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే!

,
You may also like
Latest Posts from