రావు రమేశ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన హాస్యభరిత చిత్రం ‘మజాకా’ (Mazaka Movie).ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర‍్శకుడు. తండ్రి కొడుకుల ఒకేసారి ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రంలో రీతూ చౌదరి, అన్షు (Anshu) హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగా పోలేదు. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.

శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలోకి వచ్చిన మజాకా చిత్రానికి ఓల్డ్ ఫార్మెట్ కామెడీ అని పేరు తెచ్చుకుంది. కంటెంట్ లో లోపాలే దీనికి కారణం అని తేల్చేసారు. ఇకపోతే ఇప్పుడు ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 28 నుంచి జీ5లో (Zee 5 Ott) స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు.

‘మజాకా’ విషయానికొస్తే.. రమణ (రావు రమేశ్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రి కొడుకులు. చిన్నప్పుడే భార్య చనిపోవడటంతో మరో పెళ్లి చేసుకోకుండా కొడుకుని రమణ పెంచుతాడు. కానీ కృష్ణకి పెళ్లి చేయాలనేసరికి ఇంట్లో ఆడదిక్కు లేదని ఎవరూ పిల్లనివ్వరు. దీంతో రమణ.. యశోద (అన్షు)తో, కృష్ణ.. మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.

#Mazaka, #Rao Ramesh, #Ritu Verma, #Sandeep Kishan

By admin