‘కేజీయఫ్’ షూటింగ్‌లో జరిగిన ఒక ఘటన ప్రభాస్‌ మనసుని ఎంతగా హత్తేసిందో, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ అనుభవాన్ని స్మరించుకున్నారు. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న భారీ సెట్లో ఊహించని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం సెట్‌ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. బడ్జెట్‌ విషయంలో టీమ్‌ మొత్తం నిరాశలో పడిపోయింది.

అయితే, ఆ సందర్భంలో హోంబలే బాస్‌ విజయ్‌ కిరంగదూర్‌ చెప్పిన మాటలు చిత్రబృందానికి కొత్త ఉత్సాహాన్నిచ్చినట్టయ్యాయి. “కంగారు పడొద్దు… డబ్బు గురించి ఆలోచించకండి. కథకు న్యాయం అయ్యేలా అదే స్థాయిలో మళ్లీ సెట్ వేసేద్దాం” అన్న ఆయన ధైర్యం ఆ సంఘటనలో ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలిచింది.

ప్రభాస్ ఈ విషయంలో మాట్లాడుతూ,

“ఇలాంటి సమయంలో ఎవరు అయితే బడ్జెట్‌ని పట్టించుకోకుండా క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తారో… వాళ్లతోనే నేను పని చేయాలనిపిస్తుంది. అందుకే హోంబలేతో మూడు సినిమాలు చేస్తున్నా” అని తెలిపారు.

ఈ సంఘటన హోంబలే ఫిల్మ్స్‌ నిర్మాణ విలువలు, సినిమాపై వారి కమిట్‌మెంట్‌ని స్పష్టంగా చూపిస్తుంది. విజయ్‌ లాంటి నిర్మాతలు ఉండటమే ఇండియన్ సినిమాకి అదృష్టం అని చెప్పాలి.

సెట్ కాలిపోయినా… హోంబలే ఆత్మవిశ్వాసం మాత్రం అగ్నిలా వెలిగింది!

ఈ అగ్నిప్రమాదం తర్వాత కూడా హోంబలే ఫిల్మ్స్‌ వెనకడుగు వేయలేదు. ‘కేజీయఫ్’ను దారుణమైన విజయంగా మలిచింది. అదే స్పిరిట్‌తో ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి మూడు భారీ ప్రాజెక్టులపై ముందుకెళ్తున్నారు. ‘సలార్ 2’ తో ఈ ప్రయాణం మొదలవుతుండగా, మిగిలిన రెండు సినిమాలు 2027, 2028లో విడుదల కానున్నట్లు సమాచారం.

, , ,
You may also like
Latest Posts from