చిరంజీవి ఈ వయస్సులోనూ మెగాస్టార్ గానే వెలుగుతున్నారు. ఆయనతో సినిమా చేయాలనుకున్నవాళ్లకు రెమ్యునరేషన్ భారీగా రెడీ చేసుకోవాలి. సీనియర్ హీరోలలో ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ. అయితే చిరంజీవితో సినిమా చెయ్యాలనుకునే డైరక్టర్స్ కు, ప్రొడ్యూసర్స్ కు లోటే లేదు. తాజాగా ఆయన అనీల్ రావిపూడితో ఓ సినిమా ఓకే చేసారు. ఆ సినిమాకు చిరంజీవి తీసుకుంటున్న రెమ్యునరషేషన్ ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవికి, డైరక్టర్ కు కలిపి అంత ఇచ్చేస్తే ఇంక సినిమాపై ఏమి పెడతారు అంటున్నారు. ఇంతకీ ఆ రెమ్యునరేషన్ లెక్కలేవిటో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుండగా, 2026 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ హాట్ టాపిక్‌గా మారింది.
చిరంజీవి ఈ సినిమాకు రూ.75 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకోనున్నట్లు టాక్. అలాగే, ఆయన కుమార్తె సుస్మిత నిర్మాణంలో భాగమవ్వనుండటంతో ఆమెకు కూడా రూ.10 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.
మరోవైపు, వరుస హిట్స్‌తో ఉన్న అనిల్ రావిపూడి రూ.25 కోట్లు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేవలం హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్‌లకే రూ.110 కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి.
ఇక ప్రొడక్షన్ ఖర్చులను కలిపితే మొత్తం బడ్జెట్ రూ.200 కోట్లు దాటనుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ప్రమోషన్ల కోసం రూ. 100 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది.