వేసవి ఎండలతో జనం ఓ ప్రక్కన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి దారుణంగా వుంది. జనాలు సినిమా హాళ్లకు రావడం బాగా తగ్గించేసారు. ఏదైనా ఓ రేంజి హైప్ ఉన్న సినిమా పడితే తప్ప, థియేటర్లు ఓ మాదిరి ఓపినింగ్స్ రావటంలేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘తండేల్’, ‘కోర్ట్’ వంటి కొన్ని చిత్రాలు మాత్రమే ఆడియన్స్ ను రప్పించగలిగాయి. ఈ వారం ‘ఓదెల 2’, ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కు టాక్ ఫరవాలేదనిపించినా, ప్రమోషన్స్ అదరకొడుతున్నా జనం థియేటర్స్ దగ్గర కనపడటం లేదు. రొటీన్ సినిమా అని లైట్ తీసుకున్నారు. బ్రేక్ ఈవెన్ అవుతుందనే నమ్మకం లేదు.
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’కి ఒక్కరోజు ముందు ‘ఓదెల 2’ మూవీ విడుదలైంది. సంపత్ నంది పర్యవేక్షణలో తమన్నా భాటియా కీలక పాత్రలో రూపొందిన చిత్రమిది. ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఓపినింగ్స్ అసలు లేవు, కేవలం ఓటిటి కోసమే తీసినట్లుంది అనే తేల్చేసారు.
వీక్ డేస్ లో ఈ సినిమాల ఆక్యుపెన్సీ పెద్దగా లేదు. వారాంతం అయ్యాక అసలు లేకుండా పోయింది. దానికి తోడు ఐపీఎల్ మ్యాచులు ఉన్నాయి.