తెలుగు సినిమా ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టిన సంఘటన ఇది.
తన కలను తెరపై చూపించేందుకు శ్రమించిన ఓ దర్శకుడు..
తానే తెరకెక్కించిన సినిమా ప్రివ్యూను చూస్తుండగానే
బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కన్నుమూసిన విషాదకథ ఇది.
దర్శకుడు సండ్రు నాగేష్ అలియాస్ రాంబాబు (47)
తన హృదయానికి ఎంతో దగ్గరై, తను డైరక్ట్ చేసిన సినిమా ‘బ్రహ్మాండ’
ప్రివ్యూకు హాజరై చూస్తుండగా
ఊహించని విధంగా బ్రెయిన్ స్ట్రోక్‌తో కుప్పకూలారు.
సినిమా విడుదలకు వారం రోజులే ఉన్న సమయంలో
ఆయన మృతితో చిత్రయూనిట్ ఒక్కసారిగా షాక్‌కి లోనైంది.
చివరి చూపే చివరి క్షణమైంది…
ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చోటుచేసుకుంది.
వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించినా,
మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కి తీసుకెళ్లినా
ఆయన ప్రాణాలు నిలవలేదు.
మంగళవారం అర్థరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.
“బ్రహ్మాండ” మీద పూర్తి నమ్మకంతో…
సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో
తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గుకథ నేపథ్యంలో
“బ్రహ్మాండ” అనే చిత్రాన్ని దర్శకత్వం వహించారు రాంబాబు.
జూలై 18న సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు సాగుతున్న వేళ
ఆయన అకాల మరణం చిత్రయూనిట్‌ను దుఃఖ సాగరంలో ముంచెత్తింది.
అనుభవజ్ఞుడైన సహ దర్శకుడు…
రివైండ్ చేస్తే, రాంబాబు సుమారు 150 సినిమాలు, 60 టీవీ సీరియల్స్‌కు కో-డైరెక్టర్‌గా పనిచేశారు.
ప్రస్తుతం కూడా గుర్తుండిపోయే ఈటీవీ సీరియల్స్ —
“అంతరంగాలు”, “అన్వేషణ” వంటి షోలకు
ఆయన కీలకంగా పనిచేశారు.
తెలుగు చిత్రసీమ ఒక నిశ్శబ్ద యోధుడిని కోల్పోయింది.
తన కలను తెరపై చూపించే ముందు…
ఆ కళాకారుడు ఈ లోకాన్ని వీడి వెళ్లిపోవడం
చాలా బాధాకరం…
అంతా బ్రహ్మాండమే కానీ… ఆయన లోకం మాత్రం శూన్యం అయింది.