బాలీవుడ్ లో దక్షిణాది దర్శకుల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అక్కడ హీరోలు తెలుగు, తమిళ దర్శకులు బాలీవుడ్ నటులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే వారి సినిమాలు హిందీలో కూడా మంచి విజయం సాధిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తో జాట్ సినిమా చేస్తున్నారు. అంతేకాదు అక్కడ మనవాళ్లు గట్టిగానే మసాలా నూరుతున్నారు. తాజాగా జాట్ చిత్రం నుంచి ఓ సాంగ్ ని రిలీజ్ చేస్తే అది ఇప్పుడు ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారుతోంది.
ఈ మూవీ నుంచి ‘టచ్ కియా’ అనే ప్రోమోను రిలీజ్ చేసి మేకర్స్ క్యూరియాసిటీని పెంచారు. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘టచ్ కియా’ కంప్లీట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.
ఇందులో రీసెంట్ గా ‘డాకు మహారాజ్’ సినిమాలో ‘దబిడి దిబిడి’ సాంగ్ లో అదరగొట్టిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కనిపించింది. ఈ ఐటెం సాంగ్ లో ఆమె అదిరిపోయే హుక్ స్టెప్పులతో పాటు కిల్లింగ్ ఎక్స్ప్రెషన్ తో ఆకట్టుకుంటుంది. అలాగే పాటలో ఊర్వశి హాట్ మూవ్స్, కిల్లర్ లుక్స్ గురించి చర్చ మొదలైంది.
ఈ ఫుట్ టాపింగ్ సాంగ్ కు కుమార్ సాహిత్యం అందించారు. సింగర్స్ సాధుబంతి బాగ్చి, షాహిద్ మాల్యా ఈ పాటని పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనుకున్నట్టుగానే అదిరిపోయే డాన్స్ నెంబర్ ని అందించాడు.
ఈ సాంగ్ రిలీజ్ అయిన గంట వ్యవధిలోనే యూట్యూబ్లో లక్షల్లో వ్యూస్ ని కొల్లగొడుతూ దూసుకుపోతోంది. ఇక ఈ పాటలో ఉన్న మరో స్పెషల్ ఎట్రాక్షన్ రణదీప్ హుడా, రెజీనా. మొత్తానికి మొదటి పాటతోనే మేకర్స్ ఈ ‘జాట్’ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేయగలిగారు.