వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam). ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ వారం కూడా బాక్సాఫీస్‌ వద్ద క్రేజీ చిత్రాలేవీ లేకపోవడం ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి కలిసొచ్చే అంశం.

‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. విడుద‌లై 20 రోజులు కావొస్తున్నా కలెక్ష‌న్లు మాత్రం స్ట‌డీగా కొన‌సాగుతున్నాయి. వీకెండ్స్‌లో థియేట‌ర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దీంతో వ‌సూళ్ల ప‌రంగా ఈ సినిమా ప‌లు రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంటోంది.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రానికి రూ. 303 కోట్లు వ‌చ్చిన‌ట్లు తాజాగా మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. రీజ‌న‌ల్ ఫిల్మ్ కేట‌గిరీలో ఈ చిత్రం ఆల్‌టైమ్ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింద‌ని పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.

అనిల్‌ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించిన‌ ఈ సినిమాకు భీమ్స్ అద్భుత‌మైన సంగీతం అందించారు. మూవీ ఆల్బ‌మ్‌లోని దాదాపు అన్ని పాట‌లు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. వెంకీమామ‌ స‌ర‌స‌న‌ ఐశ్వ‌ర్య రాజేశ్‌, మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌లుగా న‌టించారు.

ఈ క్రమంలో ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకుంది. తొలుత అనుకున్న ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీని స్ట్రీమింగ్‌కు తీసుకురావాలట. అయితే, మూవీని థియేటర్‌లో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతుండటంతో ఓటీటీ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాక్‌.

, , , ,
You may also like
Latest Posts from