కొన్ని కాంబినేష‌న్లు వెండి తెరని షేక్ చేస్తాయి…
విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా, రాజ‌శేఖ‌ర్ విల‌న్‌గా వ‌స్తే? అది కేవ‌లం సినిమా కాదు – ఫైర్‌వ‌ర్క్స్‌!

ఇదే కాంబినేష‌న్ ఇప్పుడు రౌడీ జనార్దన్‌లో సాధ్య‌మ‌వుతున్న‌ట్టు టాక్. ‘రాజావారు రాణీగారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను దిల్ రాజు బ్యానర్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడే ‘కింగ్‌డమ్‌’ పనుల్లో ఉన్న విజయ్, ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌కి షిఫ్ట్ కానున్నాడు.

ఇందులో విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్‌ని సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. కథ విన్న వెంటనే టీమ్ ఓ స్పెషల్ ఫోటోషూట్ కూడా నిర్వహించిందట. రాజశేఖర్ లుక్ చూసి చిత్ర టీమ్ పూర్తిగా సంతృప్తిగా ఉందని, అతడికో మంచి పారితోషికం కూడా ఆఫర్ చేశారని సమాచారం.

ఇటీవలి కాలంలో రాజశేఖర్‌కు విలన్ పాత్రల్లో మంచి క్రేజ్ ఉన్నా, ఆయన స్వయంగా చాలా ఆఫర్లను వదులుకుంటూ వస్తున్నారు. కానీ ఈ సారి మాత్రం ప్రాజెక్ట్ మీద ఆసక్తిగా ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్. విజయ్ లాంటి యంగ్ మాస్ హీరోకి భిన్నమైన మేనరిజంతో విలన్‌గా రాజశేఖర్ అంటే… థియేటర్స్‌లో ఎమోషన్, మాస్, పవర్ అన్నీ ఒక్కటిగా పేలిపోతాయ్.

హీరోయిన్ గా రష్మిక పేరు జోరుగా వినిపిస్తోంది. ఇది నిజమైతే, ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్‌’ తర్వాత విజయ్ – రష్మిక హ్యాట్రిక్ కాంబో ఇది అవుతుంది.

రౌడీ జనార్దన్‌ పక్కా మాస్ కమర్షియల్ ప్యాకేజీగా రూపొందుతోంది. యాక్షన్, ఎమోషన్, హీరో-విలన్ మైండ్‌గేమ్ – అన్నీ మిక్స్ అవుతున్న ఈ సినిమాలో ఒకవైపు విజయ్ దేవరకొండ ఫైర్ అయితే, మరోవైపు రాజశేఖర్ మాస్‌ను రెట్టింపు చేస్తే ఆశ్చర్యం లేదు.

ఇలాంటి సినిమాలే టాలీవుడ్‌కి ఫ్రెష్ ఎనర్జీ ఇస్తాయ్! రాజశేఖర్ స్టైల్‌ను చూస్తే, ఆయన కంటే ధీటుగా నెగటివ్ షేడ్స్‌ను ఎవ్వరూ తీయలేరు.
విజయ్ స్లాంగ్, swag, aggression – దానికి రాజశేఖర్ intensity, authority కలిస్తే…  వేరే లెవిల్!

,
You may also like
Latest Posts from