మరో ఐదు రోజుల్లో హృతిక్ + ఎన్టీఆర్ కాంబోతో దుమ్మురేపే War 2 థియేటర్లలోకి దూసుకొస్తోంది! రేపే హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్, అటెండ్ అవ్వబోతున్నారు ఇద్దరు స్టార్ ఫైటర్స్. ఈ మూవీ బాలీవుడ్ హిస్టరీలోనే Biggest Opening కొట్టే ఛాన్స్ ఫుల్‌గా ఉంది.
ఇది YRF స్పై యూనివర్స్‌లో 6వ సినిమా, అదీ నార్త్ – సౌత్ మాసివ్ కాంబినేషన్. హృతిక్ స్టైల్, ఎన్టీఆర్ మాస్ పవర్ కలిస్తే కౌంటర్లు బ్లాస్ట్ అవ్వక తప్పదు.
కానీ… ఇక్కడే ట్విస్ట్! Coolie కూడా అదే టైంలో రిలీజ్ అవుతుంది. ప్రోమో కంటెంట్-wise చూస్తే, War 2 అంతగా బజ్ పీక్‌కి రాలేదని అనిపిస్తోంది.
బాలీవుడ్‌లో ఇప్పటివరకూ Jawan 130Cr+ Day 1 రికార్డ్ హోల్డర్. Overseasలో War 2 3 మిలియన్ డాలర్స్ పైనే ఓపెన్ అవ్వొచ్చు, సౌత్ స్టేట్స్‌లో ఎన్టీఆర్ పవర్‌తో 40Cr+ గ్రాస్ కూడా కట్టేసే స్కోప్ ఉంది.
అంతా సెట్ అయితే, ఇండియాలో 55Cr+ Day 1 దాటితేనే బాలీవుడ్ రికార్డ్ బ్రేక్ అవుతుంది. కానీ మాస్ రిస్పాన్స్ అయితే డైరెక్ట్ 100Cr+ డే వన్ గ్యారెంటీ, బాస్!