ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న War 2 ప్రమోషన్స్ ఒక్కసారిగా పెట్రోలు మండినట్లుగా భగ్గు మంటున్నాయి! ఆగస్ట్ 10 సాయంత్రం యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్లో గ్రాండ్ గా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. అక్కడ హృతిక్ రోషన్ – ఎన్‌టీఆర్ లైవ్‌గా స్టేజ్ పైకి వస్తే, ఊహించుకోండి… గ్రౌండ్ మొత్తం మాస్ ఎనర్జీతో ఊగిపోతుంది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ గత కొంతకాలంగా “తెలుగులో ప్రమోషన్స్, హైప్ ఎక్కడ?” అని టెన్షన్ పడుతున్నారు. వాళ్ల ఉత్సాహం ఈ ఈవెంట్‌తో ఫుల్‌గా ఫిల్ అవుతుంది.
యశ్‌రాజ్ ఫిలింస్ జాగ్రత్తగా, స్లో మోషన్‌లో ప్రమోషన్స్ చేస్తూ, సరైన టైమ్‌కి మంట పెడుతోంది. ట్రైలర్ ని చూసి పీపుల్ ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ స్కై టచ్ చేశాయి.
తెలుగు రైట్స్‌ను టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్. నాగవంశీ సొంతం చేసుకున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో, కియారా అద్వాణి గ్లామర్ డోస్‌తో, యాక్షన్ – స్టైల్ – స్టార్ పవర్ అన్నీ కలిపిన సినిమా ఇది.
రిలీజ్ డేట్ ఆగస్ట్ 14. కానీ బ్రో, అదే వారం రజినీకాంత్ Coolie కూడా వస్తోంది. అంటే ఇండిపెండెన్స్ డే వీకెండ్ బాక్సాఫీస్‌లో నిజమైన వార్ స్టార్ట్ అవ్వబోతోంది.
ఈ ఈవెంట్ మిస్ అయితే… తర్వాత హైలైట్ వీడియోలు చూస్తూ “అయ్యో!” అనుకోవాల్సిందే.