
కుక్కకి ఆత్మలు కనపడితే…!?అదిరిపోయే హారర్ సినిమా ఓటిటీలో—ఎక్కడో తెలుసా?
హాలీవుడ్‌లో హారర్ అంటే లైట్ కాదు… బోన్-చిల్లింగ్. అదే లైన్‌లో ఇప్పుడు ఓ పెంపుడు కుక్కనే హీరోగా పెట్టి సాలిడ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ తెచ్చి హాలీవుడ్ ప్రేక్షకుల్ని షాక్‌కి గురిచేసిన సినిమా—“Good Boy”.
అవును… మనుషులకే కాదు, ఈ కుక్కకి కూడా ఆత్మలు కనిపిస్తాయి! అవి కూడా సాధారణ దయ్యాలు కాదు—తలనొప్పి తెప్పించే, ప్రమాదకరమైన, ఎస్కేప్ లేని దుష్ట శక్తులు.
కానీ ట్విస్ట్ ఏమిటంటే…
ఈ ధైర్యవంతమైన కుక్క తన యజమానిని కాపాడేందుకు ఆ దయ్యానే ఎదుర్కోవటం స్టార్ట్ చేస్తుంది. డైరెక్టర్ బెన్ లియోన్ బెర్గ్ ఈ కాన్సెప్ట్‌ను ఇలా నర్వ్-వ్రెక్కింగ్ ట్రీట్మెంట్‌తో చూపించాడు … కుక్కలకు కూడా ఓ సీక్రెట్ హీరో మోడ్ ఉంటుందా? అనిపిస్తుంది.
థియేటర్స్‌లో హిట్… ఇప్పుడు సైలెంట్‌గా ఓటిటీలోకి!
ఈ హారర్ థ్రిల్లర్ అక్టోబర్‌లో థియేటర్లకువచ్చి బాగానే కలెక్ట్ చేసింది. అప్పుడు మిస్ అయ్యారా? ఇప్పుడు జాగ్రత్త… ఇది చెప్పాపెట్టకుండా ఓటిటీలో వచ్చేసింది!
Amazon Prime Video – Rental only
BookMyShow Stream – Rental only
(ఫ్రీ కాదు, కానీ పెట్స్ లవర్స్ అయితే… ఈ మూవీ ప్రతి రూపాయి విలువను చూపిస్తుంది.)
డాగ్ లవర్స్‌కి ఇది Must-Watch Warning!
కుక్క ప్రేమ + గోస్ట్ థ్రిల్ + ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ కిక్స్— ఈ మూడు కలిసి వచ్చినప్పుడు వచ్చే ఫీలింగ్ సెపరేట్‌గా ఉంటుంది.
కానీ ఒక చిన్న నిరాశ… తెలుగులో ఇప్పటివరకు అందుబాటులో లేదు. అదే ఒక్క పాయింట్ “అయ్యో!” అనిపిస్తుంది.
డోంట్ మిస్… కానీ లైట్స్ ఆఫ్ చేసి చూడకండి.
