ప్రభాస్ నటుడుగా ఎంత గొప్పవాడో తన వాళ్లు అనుకున్న వాళ్లకు ఆయన తన గొప్ప మనస్సుతో అంత బాగా చూసుకుంటాడని చెప్తూంటారు. తాజాగా ఓ సంఘటన ప్రభాస్ గొప్ప మనస్సు గురించి ఓ ప్రముఖ రచయిత చెప్పుకొచ్చారు. ఆయన మరెవరో కాదు తోట ప్రసాద్. ర‌చ‌యిత తోట ప్ర‌సాద్ ప‌లు సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌ని చేశాడు. తాజాగా ఆయ‌న ప్ర‌భాస్ గొప్ప‌ద‌నాన్ని రీసెంట్ గా చెప్పారు.

తోట ప్రసాద్ మాట్లాడుతూ… ప్ర‌భాస్ తో క‌లిసి బిల్లా సినిమా కోసం వ‌ర్క్ చేసిన సందర్బాన్ని గుర్తు చేసుకున్నారు. తాను అనారోగ్యంతో ఉన్న‌ప్పుడు ప్ర‌భాసే త‌న‌కు సాయం చేశాడ‌ని, ఆయ‌నకు ఎంతో గొప్ప మ‌నసుంద‌ని తెలిపాడు. 2010లో ఆరోగ్యం బాలేక తాను హాస్పిట‌ల్ లో చేరాన‌ని చెప్పాడు. అదే టైమ్ లో ప్ర‌భాస్ తండ్రి సూర్య నారాయ‌ణ రాజు గారు చ‌నిపోయార‌ని తోట ప్ర‌సాద్ తెలిపాడు.

అలాంటి టైమ్ లో కూడా ప్ర‌భాస్ త‌న గురించి ఆలోచించాడ‌ని తోట ప్ర‌సాద్ ఎంతో ఎమోష‌న‌ల్ గా చెప్పుకొచ్చారు. ఓ ప్రక్కన తన తండ్రి మ‌ర‌ణించి బాధ‌లో ఉన్నా సరే, త‌న రైట‌ర్ గురించి ప్ర‌భాస్ ఆలోచించి, ప‌ర్స‌న‌ల్ గా ఓ మ‌నిషిని పంపి, త‌న హాస్ప‌టిల్ ఖ‌ర్చుల‌కు డ‌బ్బును కూడా పంపాడ‌ని, డార్లింగ్ గొప్ప‌ద‌నాన్ని చెప్తూ తోట ప్ర‌సాద్ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు.

,
You may also like
Latest Posts from