ఇప్పుడు ప్రతీ సినిమా ప్యాన్ ఇండియా మార్కెట్ ని కోరుకుంటోంది. ప్రయత్నిస్తోంది. అయితే సక్సెస్ అవుతోంది మాత్రం చాలా తక్కువ మంది. యాక్షన్ సినిమాలకు నార్త్ లో పెరుగుతున్న డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలని భావించే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజాగా పుష్ప 2 అందరినీ ఎలర్ట్ చేసింది. ఈ క్రమంలో మళయాళం నుంచి ‘మార్కో’ అనే సినిమా హిందీలోకి డబ్బింగ్ అయ్యింది. అక్కడ 10 కోట్లు సాధించి మళయాళ సినిమాలకు ఉత్సాహం తెచ్చింది. నార్త్ లో ఈ స్దాయి కలెక్షన్స్ తెచ్చిన సినిమా ఇదే కావటం విశేషం.
‘జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడి’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్(Unni Mukundan) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఉన్ని ముకుందన్ హీరోగా టైటిల్ రోల్‌లో నటించిన మలయాళ చిత్రం ‘మార్కో’.
హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు. ఈ చిత్రం మలయాళంలో డిసెంబరు 20న విడుదలైంది. ‘మార్కో’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.
ఈ నెల 1న ‘మార్కో’(Marco Movie) సినిమా అదే టైటిల్‌తో తెలుగుతో పాటు తమిళ, హిందీలలో విడు దలైంది. ‘మార్కో’ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా లభించిందని, తెలుగులో తొలి రోజు హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా ‘మార్కో’ నిలిచిందని చిత్రయూనిట్ చెబుతోంది.
ప్రతీకారం ప్రధానంగా.. హింసకి పరాకాష్ట అనిపించే సన్నివేశాలతో సాగే కథ ఇది. డబ్బున్న ఓ పెద్ద కుటుంబం, వ్యాపార సామ్రాజ్యం, శత్రువులు, వీళ్ల మధ్యలో ఓ పెంపుడు వారసుడు అనేది ఈ సినిమా నేపథ్యం.