సినిమా బిజినెస్ అంటే ఒక రియల్ టైమ్ ట్రేడింగ్ లాంటిది. ఒకే శుక్రవారం మొత్తం మారిపోతుంది. శుక్రవారం ఉదంయ దాకా లెక్కలు వేరేగా ఉంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక వేరేగా ఉంటాయి. అప్పటిదాకా Safe అనుకున్న Project Today Risk అవుతుంది. Box Office లో లెక్కలు ఆ రేంజ్ లో రివర్స్ అవుతాయి.
ఇదే సీన్ ఇప్పుడు రవితేజ – నాగవంశీ కాంబోలో వస్తున్న “మాస్ జాతర” కి. ఈనెల 27th కి Grand Release ప్లాన్ చేశారు. కానీ లాస్ట్ మినిట్ కి Post Production, Shoot Pending అనే ఎక్స్క్యూస్ తో వాయిదా వేశారు. కానీ అసలు మేటర్ వేరే.
‘King Dom’ – సితార బ్యానర్ లో Disaster.
‘War 2’ – నాగవంశీ రిలీజ్ చేసి Buyers కి షాక్ ఇచ్చింది.
ఇప్పటికే బయ్యర్లు టెన్షన్ లో ఉన్నారు. “ఈ నష్టాలని ‘మాస్ జాతర’ తో Recover చేయాలి” అని డైరక్ట్ ఒత్తిడి నిర్మాత నాగవంశీ మీద పెంచేశారు.
అదికాక, మాస్ జాతర మూవీ బజ్ కూడా Zero దగ్గరే ఉంది. టీజర్ Hit కాలేదు. ఒక పాట మాత్రం “బూతు పదాల” వల్ల బాగా Troll అయ్యింది. అలాంటి నెగిటివిటి లో థియేటర్ కి వస్తే రిజల్ట్ డేంజర్ అన్న ఫీలింగ్ నిర్మాతకి వచ్చింది. కాబట్టి ప్లాన్ మార్చేశారు.
“మాస్ జాతర” ఇప్పుడు డూ ఆర్ డై సిట్యువేషన్
రవితేజ – రీసెంట్ ఫ్లాప్స్ తో ఇమేజ్ డ్యామేజ్. మాస్ కమ్ కావాలి అంటే ఈ మూవీ తప్ప వేరే ఆప్షన్ లేదు.
నాగవంశీ – కింగ్డమ్, “వార్ 2” లాసెస్ కవర్ చేయాలంటే ఒక సూపర్ హిట్ కావాలి.
సింపుల్ గా చెప్పాలంటే, ఇద్దరికీ ఇది Entertainment కాదు… Survival.