‘గేమ్ చేంజర్’ రిజల్ట్ తర్వాత ‘దిల్’ రాజుకు ఆయన నిర్మాణంలో మరొక సినిమా చేస్తానని రామ్ చరణ్ మాట ఇచ్చినట్లుగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారంలో ఒక్క శాతం కూడా నిజం లేదని రామ్ చరణ్ టీమ్ తేల్చేసింది. ప్రస్తుతానికి గ్లోబల్ స్టార్ చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయని ప్రకటించింది. అయితే మీడియాలో స్టార్స్ పై రకరకాల రూమర్స్ వస్తూంటాయి. రకరకాల కాంబినేషన్స్ ప్రచారంలోకి వస్తూంటాయి. అయితే హీరోలు, నిర్మాతలు ఎవరూ కూడా సీరియస్ గా తీసుకుని ఖండన చేయరు. కానీ రామ్ చరణ్ టీమ్ పనిగట్టుకుని మరీ ఖండన చేయటం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రీసెంట్ గా సంక్రాంతికి ‘గేమ్‌ ఛేంజర్‌’తో ప్రేక్షకులను పలకరించారు రామ్ చరణ్‌. దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఇది రూపొందింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయితే . తాజాగా రామ్‌చరణ్‌ (Ram Charan) ఇదే బ్యానర్‌పై మరో సినిమా చేయనున్నట్లు జోరుగా వార్తలు ప్రచారమవుతున్నాయి. దీనిపై ఆయన టీమ్‌ స్పందించి ఆ వార్తలను ఖండించింది.

‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ మరో సినిమా చేయనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. దిల్‌రాజు బ్యానర్‌పై మరో సినిమా ప్లాన్‌ చేయలేదు. ప్రస్తుతం రామ్ చరణ్‌.. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా రానుంది’’ అని టీమ్‌ పేర్కొంది. అయితే ఇలా పనిగట్టుకుని ఖండించటం వెనక దిల్ రాజుతో రామ్ చరణ్ కు ఏమన్నా చెడిందా అనే సందేహాలు మీడియాలో ఓ వర్గం వ్యక్తం చేస్తోంది.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ఆర్‌సీ 16’(RC 16). జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) హీరయిన్. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, జగపతిబాబు ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిపి నిర్మిస్తున్నాయి.

ఇక బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా తర్వాత రామ్‌ చరణ్‌ – సుకుమార్‌ కాంబోలో ప్రాజెక్ట్‌ (RC 17) రానుంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ సూపర్‌ హిట్‌ కావడంతో RC17పై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న సినిమాలో ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుందని రాజమౌళి గతంలో చెప్పారు.

, , , ,
You may also like
Latest Posts from