జూలై 4న విడుదలైన సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘3 BHK’ సినిమా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా రిలేటెడ్ కాన్సెప్ట్ తో మెప్పించింది. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే ఓ మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరిగే ఈ కథ.. భావోద్వేగాల, సమస్యల మిశ్రమంగా సాగుతుంది. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయాని వంటి ప్రముఖులు నటించడం ప్లస్ పాయింట్ గా మారింది. అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మించారు.

టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ… థియేటర్ ల్లో మాత్రం అదే స్థాయి రెస్పాన్స్ రాలేదు. రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ వచ్చినా, వసూళ్లు మాత్రం యావరేజ్ గా వచ్చాయి.

ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి:

నైజాం – ₹0.62 కోట్లు

సీడెడ్ – ₹0.11 కోట్లు

ఆంధ్ర (మొత్తం) – ₹0.51 కోట్లు

ఏపీ + తెలంగాణ (షేర్) – ₹1.24 కోట్లు

టోటల్ గ్రాస్ – ₹2.13 కోట్లు

థియేట్రికల్ బిజినెస్ vs కలెక్షన్లు:

థియేట్రికల్ బిజినెస్: ₹2.2 కోట్లు

బ్రేక్ ఈవెన్ లక్ష్యం: ₹2.5 కోట్ల షేర్

ఇప్పటివరకు వచ్చిన షేర్: ₹1.24 కోట్లు

ఇంకా అవసరమైన షేర్: ₹1.26 కోట్లు

పాజిటివ్ టాక్ ఉన్నా సరే, కమర్షియల్ గా సినిమా ఇంకా గట్టిగా నిలబడలేకపోయింది. వర్కింగ్ డేస్ లో డల్ షోస్, వారాంతాల్లోనూ మోస్తరు రెస్పాన్స్ కారణంగా బ్రేక్ ఈవెన్ చేరడం కష్టమేననిపిస్తుంది. వచ్చే రోజుల్లో మౌత్ టాక్ బలంగా పని చేస్తే తప్ప… ఈ సినిమా సేఫ్ జోన్ చేరడం క్లిష్టమే.

, , , , , ,
You may also like
Latest Posts from