
హాలీవుడ్‌లో అత్యంత పాపులర్ నటీమణుల్లో సిడ్నీ స్వీని (Sydney Sweeney) ఒకరు. Euphoria, White Lotus వంటి సూపర్ హిట్ సిరీస్‌లతో Gen Z ఆడియన్స్‌కి ఐకాన్‌గా మారిన ఈ బ్యూటీ, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్లలో కూడా మెరిసింది.
అలాగే అమెరికన్ ఈగిల్ డెనిమ్ క్యాంపైన్‌లో పోజులిచ్చినప్పుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద కామెంట్ చేసిన విషయం గుర్తుందా? అంతటి గ్లోబల్ రీచ్ ఉన్న స్టార్ ఇప్పుడు ఇండియన్ సినిమా వైపు మళ్లిందని టాక్.
తాజాగా ఒక ఇండియన్ ప్రొడక్షన్ హౌస్ సిడ్నీ స్వీని కి మెయిన్ హీరోయిన్గా నటించేందుకు దాదాపు రూ.500 కోట్లు ఆఫర్ చేసిందని వార్తలు ఊపందుకున్నాయి.
స్వీని మాత్రం ఈ వార్తపై ఎలాంటి కన్‌ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో సస్పెన్స్ మరింత పెరిగింది.
ఇండస్ట్రీ వర్గాలు మాత్రం గెస్ గేమ్ మొదలుపెట్టాయి – ఇది బాలీవుడ్ మాస్ ప్రాజెక్ట్ అయి ఉంటుందా? లేక రాజమౌళి గ్లోబల్ వెంచర్? లేక అల్లు అర్జున్ కొత్త పాన్-ఇండియా బిగ్గీనా?
కానీ… రాజమౌళి లేదా అల్లు అర్జున్ బేనర్ నుంచి ఇంత భారీ ఆఫర్ రావడం కాస్త అనుమానాస్పదంగా కనిపిస్తోంది.
ఎవరా ఆ ప్రొడక్షన్ హౌస్? నిజంగానే సిడ్నీ స్వీని ఇండియన్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది!
