ఒకే స్క్రీన్ మీద టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ బచ్చన్ కలిసి కనిపిస్తే ఎలాంటి కిక్ వస్తుందో ఊహించగలరా? ఇప్పుడే అలాంటి ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఇప్పటికే మనం, సైరా నరసింహా రెడ్డి, కల్కి 2898 AD వంటి తెలుగు సినిమాల్లో మెరిశారు. ఆయన కోడలు, గ్లోబల్ ఐకాన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఒక తెలుగు పాటలో కనిపించారు. ఇప్పుడు జూనియర్ బచ్చన్ – అభిషేక్ బచ్చన్ తెలుగు తెరపై ఎంట్రీకి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ అనే భారీ యాక్షన్ డ్రామాలో అభిషేక్‌కి కీలకమైన పాత్ర ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌లో సగం పూర్తయిందట.

ముఖ్యంగా అమితాబ్ – ప్రభాస్ మధ్య ఉన్న దగ్గరి బంధం వల్లే, అభిషేక్ ఈ ఆఫర్‌ని ఎలాంటి సందేహం లేకుండా ఓకే చేశారని టాక్. అయితే అధికారికంగా మాత్రం ఇంకా అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

బాలీవుడ్‌లో ధూమ్, సర్కార్ వంటి హిట్ ఫ్రాంచైజ్‌లతో గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్, ఇప్పుడు వెరైటీ కాన్సెప్ట్ సినిమాలు, ఓటీటీలో విభిన్న పాత్రలు చేస్తున్నారు.

ఇక ఇప్పుడు ఆయన – ప్రభాస్ కాంబినేషన్ నిజమైతే, ఇది టాలీవుడ్ – బాలీవుడ్ ఫ్యాన్స్‌కి మైండ్‌-బ్లోయింగ్ ఫీస్ట్ కాదా?

, , , ,
You may also like
Latest Posts from