
5 గంటలకే ప్రీమియర్ షోలు? బాహుబలి, మాస్ జాతర కొత్త ట్రెండ్!
ఇన్నాళ్ళూ రాత్రి 9, 11 లేదా తెల్లవారుఝామునే జరిగే పెయిడ్ ప్రీమియర్ షోలు ఇక రూట్ మార్చుకోనున్నాయి! సినీ ఇండస్ట్రీ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ వైపు అడుగు వేస్తోంది — అవే సాయింత్రం నుంచే ప్రీమియర్ షోలు!
బాహుబలి ఎపిక్ – 5 గంటలకే తొలి షో!
రాజమౌళి మరోసారి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. “బాహుబలి ఎపిక్” పేరుతో రెండు భాగాల బాహుబలి సినిమా ఈ శుక్రవారం (అక్టోబర్ 31) విడుదల కానుంది. కానీ అసలు సెన్సేషన్ ఏమిటంటే — ప్రీమియర్ షోలు గురువారం (అక్టోబర్ 30) సాయంత్రం 5 గంటలకే ప్రారంభం!
హైదరాబాద్‌లో 5, 5.30కి మొదటి షోలు పడుతుండగా, ఆ తరువాత దేశవ్యాప్తంగా మరిన్ని ప్రీమియర్ స్క్రీనింగ్స్ ప్లాన్ అయ్యాయి.
స్పెషల్ ఏమిటంటే — సాధారణ ప్రేక్షకులు కూడా ఈ టికెట్లు బుక్ చేసుకొని చూడొచ్చు!
మాస్ జాతర – రవితేజ స్టైల్లో కొత్త ఎక్స్‌పెరిమెంట్!
మరోవైపు రవితేజ నటిస్తున్న “మాస్ జాతర” కూడా కొత్త బాటలోనే నడుస్తోంది. ఈ సినిమా శనివారం (నవంబర్ 1) విడుదల అవుతున్నప్పటికీ, శుక్రవారం (అక్టోబర్ 31) సాయంత్రం 5.30 గంటలకే మొదటి పెయిడ్ ప్రీమియర్ షో స్టార్ట్ అవుతోంది!
ఇది కొత్త ట్రెండా? లేక మార్కెట్ మాస్టర్ప్లాన్?
రాత్రి అర్ధరాత్రి షోల బదులు, ఇప్పుడు సాయంత్రం నుంచే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం. ఇది డిస్ట్రిబ్యూటర్ల స్మార్ట్ మూవ్‌గా పరిశ్రమ చూస్తోంది. “బాహుబలి ఎపిక్”, “మాస్ జాతర” ఈ మార్గాన్ని మొదటగా ఆరంభించడంతో, ముందు వచ్చే పెద్ద సినిమాలు కూడా ఇదే పద్దతిని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది!
