సినిమా వార్తలు

న్యూ ఇయర్ వీకెండ్: ఓటిటిలో సినిమాల జాతర.. లిస్ట్!

ఒకప్పుడు సినిమా అంటే థియేటర్.. వీకెండ్ వచ్చిందంటే టికెట్ల కోసం క్యూలు, హంగామా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. టికెట్ రేట్లు సామాన్యుడికి భారంగా మారడం, పార్కింగ్ ఛార్జీలు, స్నాక్స్ రేట్లు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రేక్షకులు ‘స్మార్ట్’ గా ఆలోచిస్తున్నారు.

వేల రూపాయలు ఖర్చు చేసి థియేటర్‌కు వెళ్లేకంటే, ఒక నెల ఆగితే ఓటిటిలోకి వస్తుంది కదా అనే ధోరణి పెరిగిపోయింది. ఇంట్లోనే హోమ్ థియేటర్లు, స్మార్ట్ టీవీలు అందుబాటులోకి రావడంతో జనం థియేటర్ల మొహం చూడటం మానేసి ఓటిటిలకు అతుక్కుపోతున్నారు. ఈ మార్పును గమనించిన ఓటిటి సంస్థలు కూడా న్యూ ఇయర్ వీకెండ్ సందర్భంగా భారీ సినిమాలతో సిద్ధమయ్యాయి.

ఈ వారం రోషన్ కనకాల ‘మౌగ్లీ 2025’ నుంచి హాలీవుడ్ సెన్సేషన్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ వరకు ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ న్యూ ఇయర్ వీకెండ్ లో మిమ్మల్ని అలరించబోతున్న సినిమాల పూర్తి లిస్ట్ ఇదే:

న్యూ ఇయర్ ఓటిటి స్పెషల్ లిస్ట్ (డిసెంబర్ 31 – జనవరి 3)

డిసెంబర్ 31 (న్యూ ఇయర్ ఈవ్)
ఎకో (Eko): ఐదు భాషల్లో (తెలుగుతో సహా) వస్తున్న మలయాళీ థ్రిల్లర్ – నెట్‌ఫ్లిక్స్
ఇత్తిరి నేరం: మలయాళం డ్రామా – సన్ నెక్స్ట్

జనవరి 1 (న్యూ ఇయర్ ఫస్ట్ డే):

మౌగ్లీ 2025 (Mowgli): రోషన్ కనకాల నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ – ఈటీవీ విన్

  • స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things S5 Final): ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సిరీస్ ఫైనల్ పార్ట్ – నెట్‌ఫ్లిక్స్
  • LBW (లవ్ బియాండ్ వికెట్): తమిళ్ క్రేజీ యూత్ ఫుల్ మూవీ – జియో ప్లస్ హాట్‌స్టార్
  • రన్ అవే (RunAway): ఇంటర్నేషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ – నెట్‌ఫ్లిక్స్
  • ది గుడ్ డాక్టర్ (The Good Doctor S7): మెడికల్ డ్రామా ఫైనల్ సీజన్ – నెట్‌ఫ్లిక్స్
  • స్నిపర్: ది లాస్ట్ స్టాండ్: హై-ఓల్టేజ్ యాక్షన్ మూవీ – నెట్‌ఫ్లిక్స్ జనవరి 2 (ఫ్రైడే స్పెషల్):
  • బ్యూటీ (Beauty): అంకిత్ కొయ్య, నిహారిక నటించిన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ – జీ5
  • హక్ (Haq): ఇంటెన్స్ హిందీ వెబ్ సిరీస్ – నెట్‌ఫ్లిక్స్
  • డ్రాకులా (Dracula): ఇంటర్నేషనల్ హారర్ క్లాసిక్ – ప్రైమ్ వీడియో
  • గ్రిజ్జీ అండ్ ది లెమ్మింగ్స్ (S4): పిల్లల కోసం యానిమేషన్ సిరీస్ – నెట్‌ఫ్లిక్స్ జనవరి 3:
  • కుమ్కీ 2 (Kumki 2): తమిళ్ అడ్వెంచరస్ డ్రామా – ప్రైమ్ వీడియో

ఈ వీకెండ్ హైలైట్స్:

  • మౌగ్లీ 2025: థియేటర్లలో విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ఓటిటిలోకి వస్తోంది.
  • స్ట్రేంజర్ థింగ్స్: పదేళ్ల సుదీర్ఘ ప్రయాణానికి నేటితో ఎండ్ కార్డ్ పడబోతోంది. నెట్‌ఫ్లిక్స్ లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్.
  • బ్యూటీ: మారుతి సమర్పణలో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది.

Similar Posts