
షారుఖ్, రణవీర్ కాదు.. ఇప్పుడు అసలైన ‘డాన్’ వస్తున్నాడు!
బాలీవుడ్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ‘గ్రీక్ గాడ్’ హృతిక్ రోషన్ పేరే గుర్తొస్తుంది. ఇటీవల వచ్చిన ‘వార్ 2’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా, హృతిక్ క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు.
తన లుక్స్, బాడీ లాంగ్వేజ్ మరియు అదిరిపోయే యాక్షన్ స్టంట్స్‌తో నేటికీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతున్నారు. హృతిక్ సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ లో ఉండే ఊపు వేరు. అయితే, ఇప్పుడు హృతిక్ రోషన్ చుట్టూ ఒక భారీ రూమర్ బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదే ‘డాన్ 3’!
డాన్ సీక్వెల్స్ అంటే ఆ రేంజ్ క్రేజ్ మరి!
అమితాబ్ బచ్చన్ నుంచి షారుఖ్ ఖాన్ వరకు.. ‘డాన్’ అనే టైటిల్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. షారుఖ్ హీరోగా వచ్చిన రెండు భాగాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ‘డాన్ 3’ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ షారుఖ్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఆ బాధ్యతను రణవీర్ సింగ్‌కు అప్పగించారు.
అయితే తాజాగా రణవీర్ సింగ్ కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు ఫర్హాన్ అక్తర్ ఇప్పుడు హృతిక్ రోషన్‌ను సంప్రదించే యోచనలో ఉన్నారట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గతంలో ‘డాన్ 2’లో హృతిక్ ఒక చిన్న క్యామియో రోల్‌లో కనిపించి మెప్పించారు. ఇప్పుడు అదే ‘డాన్’ సిరీస్‌లో మెయిన్ లీడ్ చేసే అవకాశం రావడం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది.
హృతిక్ ఓకే చెబుతారా?
ప్రస్తుతం హృతిక్ రోషన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘క్రిష్ 4’ (Krrish 4) పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా కూడా పరిచయం కాబోతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంత బిజీ షెడ్యూల్‌లో హృతిక్ ‘డాన్ 3’ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఒకవేళ హృతిక్ గనుక ‘డాన్’ గా మారితే, బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, ఈ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
