జబర్దస్త్ వేదికపై పంచ్‌లతో ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ చేసే హైపర్ ఆది.. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ అవే పంచ్‌లు పేలుస్తున్నారు. అయితే, ఈసారి ఆయన టార్గెట్ కేవలం కమెడియన్లు మాత్రమే కాదు.. ఏకంగా తనను చంపేస్తామని బెదిరిస్తున్న ‘అజ్ఞాత’ శత్రువులే! తాజాగా ఒక వైరల్ ఇంటర్వ్యూలో ఆది బయటపెట్టిన విషయాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

హైపర్ ఆది బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ ((Big Tv Kissik Talks) అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో ఆయన కాలేజ్ రోజుల్ని గుర్తు చేసుకుంటూ షాకింగ్ విషయం వెల్లడించాడు. తాను చదువుకునే రోజుల్లోనే పవన్ కళ్యాణ్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించేవాడినని, ఆ కారణంగా తీవ్ర బెదిరింపులు ఎదుర్కొన్నానని చెప్పాడు.

‘నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పేరు పలికితేనే కోపంగా చూసేవారు. ఒకసారి దాదాపు పది మంది సీనియర్లు నన్ను కాలేజ్ బిల్డింగ్ పైకి లాక్కెళ్లి, ఇంకోసారి పవన్ కళ్యాణ్ పేరు తీస్తే పై నుంచి తోసేస్తాం అంటూ బెదిరించారు’ అని ఆది చెప్పిన మాటలు అందరినీ షాక్‌కు గురిచేశాయి.

పవన్ కళ్యాణ్ కోసం ‘డెత్ త్రెట్స్’.. వెనక్కి తగ్గని ఆది!

పవన్ కళ్యాణ్ అంటే ఆదికి పంచ ప్రాణాలు. ఆ అభిమానమే ఇప్పుడు ఆయనకు శత్రువులను పెంచినట్లు తెలుస్తోంది. పవన్‌కు మద్దతుగా నిలుస్తున్నందుకు, ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎండగడుతున్నందుకు ఆదికి వరుసగా చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ (Death Threats) వస్తున్నాయట.

“నన్ను ఎంత మంది బెదిరించినా.. ఎన్ని ఫోన్లు చేసినా నేను భయపడను. నా రాజకీయం, నా మద్దతు అంతా పవన్ కళ్యాణ్ గారికే! ఆయన కోసం నిలబడితే ప్రాణాలు పోతాయన్నా నేను వెనక్కి తగ్గను” అంటూ ఆది ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హీట్ పుట్టిస్తున్నాయి.

ఎవరా అజ్ఞాత వ్యక్తులు?

పవన్ కళ్యాణ్ సభల్లో ఆది ఇచ్చే స్పీచ్‌లు సోషల్ మీడియాను ఊపేస్తుంటాయి. అయితే, ఈ స్పీచ్‌లే కొందరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయట. అందుకే ఆదిని భయపెట్టాలని చూస్తున్నారని, కానీ ఆది మాత్రం “పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.. భయపడే ప్రసక్తే లేదు” అంటూ రివర్స్ వార్నింగ్ ఇస్తున్నారు.

షోలు బంద్.. కేవలం పవన్ కోసమే!

కేవలం మాటలతోనే కాకుండా, ఎన్నికల సమయంలో తన షూటింగ్‌లు, షోలు కూడా వదులుకుని పవన్ గెలుపు కోసం ఆది అహర్నిశలు శ్రమించారు. “నాకు తెలిసిన రాజకీయం కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే.. ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా” అని తెగేసి చెప్పడం ఆయనCommitment కు నిదర్శనం.

ప్రస్తుతం హైపర్ ఆది చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ, జనసేన శ్రేణుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధానికే దారితీస్తున్నాయి. పవన్ కోసం ఆది పడుతున్న ఈ రిస్క్ చూసి ఫ్యాన్స్ “నువ్వు తగ్గొద్దు ఆది అన్న.. నీ వెనుక మేమంతా ఉన్నాం” అంటూ మద్దతు తెలుపుతున్నారు.

#Big Tv Kissik Talks, #Death Threats, #hyper aadi, #Pawan Kalyan, #Tollywood

By admin