ఈ సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ మామూలుగా లేదు బాస్! ముగ్గురు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ బరిలో ఉన్నా.. అందరి కళ్లు మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ – తలపతి విజయ్ మీదనే ఉన్నాయి. అయితే, తాజాగా బయటకు వచ్చిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్స్ చూస్తుంటే.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు గట్టి ‘సర్ప్రైజ్’ తగిలినట్టే కనిపిస్తోంది. విజయ్ తన లేటెస్ట్ సినిమా ‘జన నాయగన్’ తో ఓవర్సీస్ మార్కెట్‌ను ఊడ్చేస్తున్నాడు.
విజయ్ మేనియా.. ‘రాజా సాబ్’ ఎక్కడ?
సందీప్ వంగ ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ అని ప్రభాస్‌ను పిలిచిన తర్వాత, డార్లింగ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ, ఓవర్సీస్ బుకింగ్స్ లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో.. మన టాలీవుడ్‌కు కంచుకోట లాంటి చోట కూడా విజయ్ తన ‘జన నాయగన్’ తో ప్రభాస్‌ను వెనక్కి నెట్టేశాడు.
USA బుకింగ్స్: ‘రాజా సాబ్’ కు 1200 షోలు ఉన్నా కేవలం 600K డాలర్లు మాత్రమే వస్తే.. విజయ్ ‘జన నాయగన్’ మాత్రం కేవలం 500 షోలతోనే 800K డాలర్లు కొల్లగొట్టింది. ఇది కదా అసలైన డామినేషన్!
UK, మలేషియాలో విజయ్ ‘ర్యాంపేజ్’..
యూనైటెడ్ కింగ్‌డమ్‌లో విజయ్ సినిమాకు 50 వేల టికెట్లు అమ్ముడుపోతే, రాజా సాబ్ 20 వేల దగ్గరే ఆగిపోయింది. ఇక మలేషియాలో అయితే తలపతి ఫ్యాన్స్ ‘నెక్స్ట్ లెవల్’ ఎనర్జీ చూపిస్తున్నారు. బుకింగ్స్ మొదలైన 24 గంటల్లోనే 1.10 లక్షల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ రేంజ్ ఊపును చూసి ట్రేడ్ వర్గాలే నోరెళ్లబెడుతున్నాయి.
రీమేక్ అయినా.. విజయ్ క్రేజ్ అన్‌స్టాపబుల్!
విశేషం ఏమిటంటే.. ‘జన నాయగన్’ ఒక రీమేక్ సినిమా. మన తెలుగులో బాలయ్య హిట్ కొట్టిన ‘భగవంత్ కేసరి’ కి ఇది అఫీషియల్ రీమేక్. రీమేక్‌లను జనాలు పెద్దగా పట్టించుకోని ఈ రోజుల్లో కూడా విజయ్ తన స్టార్ పవర్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. విజయ్ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు చేస్తున్న ఆఖరి సినిమా కావడంతో ఈ రేంజ్ వైబ్స్ ఉన్నాయని జెన్-జీ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ కేవలం తెలుగులో మాత్రమే వస్తుండటంతో, ఓవర్సీస్ వార్ ఇప్పుడు ప్రభాస్ vs విజయ్ గా మారిపోయింది. మరి జనవరి 9న థియేటర్లలో ఏ రాజా గెలుస్తాడో చూడాలి!

