
నిర్మాత నాగవంశీ విశ్వరూపం.. స్టేజ్ మీదే ఫోన్ లో అరుపులు, కేకలు! వణికిపోయిన మీనాక్షి చౌదరి!
టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్, యూత్ ముద్దుగా పిలుచుకునే ‘చింటూ’ అలియాస్ నాగవంశీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన యాటిట్యూడ్ తో, ముక్కుసూటి మాటలతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఈ క్రేజీ నిర్మాత.. తాజాగా ఒక స్టేజ్ మీదే కోపంతో ఊగిపోవడమే కాకుండా, పెద్దగా అరుస్తూ అందరినీ భయపెట్టేశారు. ఆ దెబ్బకు పక్కనే ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి వణికిపోగా.. హీరో నవీన్ పోలిశెట్టి బిత్తరపోయి చూశాడు.
అసలేం జరిగిందంటే? నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన క్రేజీ మూవీ ‘అనగనగా ఒక రాజు’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ లోని ఒక థియేటర్ లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ ప్రదర్శిస్తున్న సమయంలో నాగవంశీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఎత్తిన వెంటనే ఆయన మొహం ఎర్రగా మారిపోయింది. తీవ్రమైన కోపంతో అవతలి వ్యక్తిపై పెద్ద గొంతుతో అరుస్తూ విరుచుకుపడ్డారు.
నాగవంశీ ఆ రేంజ్లో రగిలిపోవడం చూసి స్టేజ్ మీద ఉన్నవారంతా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా మీనాక్షి చౌదరి ఒక్కసారిగా ఖంగుతిని భయంతో దిక్కులు చూడటం కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చిచ్చు రేపుతోంది.
నెటిజన్ల ట్రోలింగ్.. మీమర్స్‌కు పండగే!
గతంలో ‘వార్ 2’ ఈవెంట్ లో నోరు జారి నెటిజన్ల ఆగ్రహానికి గురైన నాగవంశీకి, ఈ సెకండ్ హాఫ్ పెద్దగా కలిసి రావడం లేదని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ వైరల్ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “అవతలి వ్యక్తి నాగవంశీని అంతగా విసిగించాడా? లేక చెప్పిన పని చేయలేదని మండిపడుతున్నాడా?” అంటూ చర్చించుకుంటున్నారు. ఇక మీమర్స్ అయితే రేపటి నుంచి ఈ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసేందుకు రెడీ అయిపోయారు.
సంక్రాంతి రేసులో ‘రాజు’ పరిస్థితి ఏంటి?
ఇక సినిమా విషయానికి వస్తే.. ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. నవీన్ పోలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడు. అయితే ఈ సంక్రాంతికి ప్రభాస్ ‘రాజా సాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ చిత్రాలు బరిలో ఉన్నాయి. ఒకవేళ ఆ సినిమాల టాక్ అటు ఇటు అయితే, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ ‘రాజు’ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడం ఖాయమని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
