సినిమా వార్తలు

“వీడేంట్రా బాబు.. మహేష్ బాబు ముందే ఎక్స్ట్రాలు చేస్తున్నాడు!” – నవీన్ పోలిశెట్టిపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ నవీన్ పోలిశెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆయన ఈ స్థాయికి రావడానికి వెనుక ఉన్న కష్టం, డెడికేషన్ గురించి రీసెంట్‌గా ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మహేష్ బాబు నటించిన ‘వన్: నేనొక్కడినే’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ నవీన్ తపనను కొనియాడారు.

అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్!

బుచ్చిబాబు మాట్లాడుతూ.. “నవీన్ నాకు ‘వన్: నేనొక్కడినే’ సినిమా అప్పటి నుండి తెలుసు. అప్పుడు నేను ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నాను, నవీన్ అందులో ఒక చిన్న పాత్ర చేస్తున్నాడు. అందులో ‘హూ ఆర్ యు’ అనే సాంగ్‌లో మహేష్ బాబు గారిని చూసి గట్టిగా అరిచే ఒకే ఒక్క షాట్ నవీన్ మీద ఉంటుంది” అని చెప్పారు.

19 టేకులు.. డైరెక్షన్ టీమ్ తిట్లు!

ఆ ఒక్క షాట్ కోసం జరిగిన హంగామాను వివరిస్తూ.. “దర్శకుడు సుకుమార్ గారు 10 టేకుల తర్వాత షాట్ ఓకే అన్నారు. కానీ నవీన్ మాత్రం సంతృప్తి చెందలేదు. ‘సార్.. ప్లీజ్ వన్ మోర్’ అంటూ ఏకంగా 19 టేకులు తీసుకున్నాడు. అప్పుడు లంచ్ టైంలో మేమంతా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో కూర్చుని.. ఇదేంట్రా బాబు, ఈ అబ్బాయి ఇంత ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అని అనుకున్నాం” అని బుచ్చిబాబు నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.

అప్పుడే జోస్యం చెప్పిన సూపర్ స్టార్!

నవీన్ డెడికేషన్ చూసి అప్పట్లోనే మహేష్ బాబు ఒక మాట అన్నారట. “ఈ అబ్బాయి భలే చేస్తున్నాడు కదా.. కచ్చితంగా పెద్ద స్టార్ అవుతాడు” అని మహేష్ బాబు అప్పుడే అన్నారని బుచ్చిబాబు వెల్లడించారు. ఇప్పుడు నవీన్ సాధించిన సక్సెస్ చూస్తుంటే, ఆ రోజు అతను పడ్డ తపనే అతన్ని ఈ స్థాయికి తెచ్చిందని అర్థమవుతోందని, నవీన్ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని బుచ్చిబాబు ఆకాంక్షించారు.

Similar Posts