టాలీవుడ్‌లో ట్రిపుల్ హ్యాట్రిక్ అనే పదం వింటే రాజమౌళి గుర్తొస్తారు.. కానీ ఇప్పుడు ఆ రికార్డును అనిల్ రావిపూడి తన పేరున రాసుకున్నారు. గొప్ప డైలాగులు, భారీ కథలు లేకపోయినా.. ప్రేక్షకుల పల్స్ పట్టి నవ్వించడంలో అనిల్ స్టైలే వేరు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలై, మెగాస్టార్‌ను మెప్పించే స్థాయికి ఎదిగిన అనిల్ రావిపూడి, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఫిక్స్ చేసినట్లు సమాచారం!
దిల్ రాజు మాస్టర్ ప్లాన్!
గత రెండు నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ సెట్ అయిందట.
స్టోరీ లైన్: ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్‌ఫుల్ ‘లెక్చరర్’ పాత్రలో కనిపించబోతున్నారట.
అనిల్ మాట: పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని, కేవలం 70 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేస్తానని అనిల్ రావిపూడి హామీ ఇచ్చారట.
పవన్ రియాక్షన్: కథ విన్న పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి ఎనర్జీకి ఫిదా అయ్యారని.. “అన్నయ్య (చిరంజీవి) సినిమా రిలీజ్ అయ్యాక పూర్తి స్క్రిప్ట్‌తో రా” అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
సంక్రాంతి శాపం కు అడ్డకట్టేయటానికేనా?
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి కానీ, సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఆ స్థాయి హిట్లు లేవు. ఈసారి అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో ఆ సంక్రాంతి సెంటిమెంట్‌ను చెరిపేసి, భారీ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబో 2027 సంక్రాంతి బరిలో ఉండే అవకాశం ఉంది.
మెగా స్టార్ తర్వాత పవర్‌స్టార్!
మెగాస్టార్‌తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి మాస్ ఎంటర్‌టైనర్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు పవర్ స్టార్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారోనని మెగా అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దిల్ రాజు బ్యానర్‌లో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.

