మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ తేజ్. అయితే, గత మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరచడంతో మెగా ప్రిన్స్ ఈసారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్ మరియు అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు.
ఏమిటీ ‘కొరియన్ కనకరాజు’ రచ్చ?
వరుణ్ తేజ్ 15వ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ (KOKA) అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
లూంగీలో మాస్ ఎంట్రీ: గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ లుంగీ కట్టుకుని, చేతిపై త్రిశూలం టాటూతో, నీలి రంగు కళ్లతో చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు.
కొరియాలో కత్తి యుద్ధం: కొరియన్ పోలీస్ స్టేషన్‌లో కమెడియన్ సత్యని పోలీసులు విచారిస్తుంటే.. వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చి కత్తితో పోలీసులను ఊచకోత కోస్తాడు.
దెయ్యం ట్విస్ట్:
ఈ గ్లింప్స్ చివర్లో వరుణ్ తేజ్‌ను ఒక దెయ్యం ఆవహించినట్లు చూపించడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అసలు కొరియాలో వీళ్లేం చేస్తున్నారు? ఆ దెయ్యం కథ ఏంటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

