సినిమా వార్తలు

బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ మామూలు ప్లాన్ లేదుగా! మొత్తం టాలీవుడ్ నే మూట కట్టేసిందిగా

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నెట్‌ఫ్లిక్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా 2026 సంవత్సరానికి గాను ఏకంగా 13 తెలుగు చిత్రాల డిజిటల్ రైట్స్‌ను మార్కెట్ లో పోటీ పడి మరీ భారీ ధరకే సొంతం చేసుకుంది. ఇందులో స్టార్ హీరోల నుండి క్రేజీ ప్రాజెక్టుల వరకు అన్నీ ఉండటంతో ఓటీటీ ప్రియుల్లో అప్పుడే క్యూరియాసిటీ మొదలైంది.

ఈ నెలలోనే గతేడాది థియేటర్లలో విడుదలైన రోషన్ ‘ఛాంపియన్’ స్ట్రీమింగ్ కానుండగా, మిగిలిన 12 సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ క్రేజీ సినిమాల లిస్ట్ ఇదే:

నెట్‌ఫ్లిక్స్ బాస్కెట్‌లో ఉన్న ఆ 13 సినిమాలు ఇవే:

ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్.

పెద్ది (Peddi): గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్.

ది పారడైజ్: నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ సెన్సేషన్.

ఆకాశంలో ఒక తార: దుల్కర్ సల్మాన్ క్రేజీ తెలుగు మూవీ.

ఆదర్శ కుటుంబం: విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా.

VD14: విజయ్ దేవరకొండ – రాహుల్ సంకృత్యన్ పీరియాడిక్ డ్రామా.

బైకర్: శర్వానంద్ అడ్వెంచరస్ ఫిలిం.

ఫంకీ: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మార్క్ సినిమా.

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్: టాలెంటెడ్ నటుడు ఫహాద్ ఫాజిల్ మూవీ.

MAD జూనియర్స్: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’ సీక్వెల్/ఫ్రాంచైజీ.

రాక్షస: నిహారిక కొణిదెల లీడ్ రోల్‌లో వస్తున్న సినిమా.

418: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, ప్రశాంత్ నీల్ సమర్పణలో వస్తున్న ఆసక్తికర చిత్రం.

ఛాంపియన్: రోషన్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా (ఈ నెల నుండే స్ట్రీమింగ్).

ఈ భారీ డీల్స్ చూస్తుంటే 2026లో ఓటీటీ మార్కెట్‌ను నెట్‌ఫ్లిక్స్ రూల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్, చరణ్ వంటి టాప్ స్టార్స్ సినిమాలు ఉండటంతో సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

Similar Posts