టాలీవుడ్ ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఒక భారీ సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. రాధే శ్యామ్ తర్వాత ఆశించిన స్థాయిలో హిట్లు లేకపోయినా, ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ‘జన నాయకుడు’తో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే, తాజాగా పూజా చేసినట్లుగా ప్రచారంలో ఉన్న కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో కార్చిచ్చు రేపుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అగ్ర నటిగా కొనసాగుతున్న అందాల భామల్లో పూజా హెగ్డే ఒకరు అనడంలో సందేహం లేదు. తెలుగు, తమిళం, హిందీ అనే భాషాభేదం లేకుండా టాప్ హీరోయిన్‌గా తన కెరీర్ గ్రాఫ్‌ను రివ్వున దూసుకుపోయేలా చేస్తోంది.

ఇటీవల తాను, అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూజా తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. పూజా కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచిన ఈ సినిమా పోస్ట్‌ను అల్లు అర్జున్ అభిమానులు కూడా విపరీతంగా వైరల్ చేశారు.

సోషల్ మీడియాలో పూజా ట్రెండింగ్‌లో ఉన్న సమయంలో ఆమె పాత ఇంటర్వ్యూ ఒకటి మళ్ళీ వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. షూటింగ్ సమయాల్లో కొందరు స్టార్ నటీనటులు తమ స్థాయి మరిచి, పాటించాల్సిన ప్రాథమిక నైతికతను పక్కనపెట్టి చెడుగా ప్రవర్తిస్తారని పూజా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

గతంలో ఒక భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నప్పుడు తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పూజా ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. తన అనుమతి లేకుండా ఒక స్టార్ హీరో నేరుగా తన కారవాన్‌లోకి చొరబడ్డాడని ఆమె వెల్లడించింది.

కారవాన్‌లోకి రావడమే కాకుండా, సదరు హీరో తనతో చాలా అసభ్యకరంగా, చెడుగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడని పూజా సంచలన ఆరోపణలు చేసింది. ఆ సమయంలో ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అనే విషయాన్ని కూడా తాను పట్టించుకోలేదని ఆమె స్పష్టం చేసింది.

హద్దు మీరి ప్రవర్తించిన ఆ హీరో ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అక్కడికక్కడే అతని చెంప చెళ్లుమనిపించినట్లు పూజా తెలిపింది. ఈ సాహసోపేతమైన చర్యతో సెట్స్‌లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారట.

“ఆ సంఘటన తర్వాత ఆ హీరోతో ఎప్పటికీ నటించకూడదని నిర్ణయించుకున్నాను, ఇకముందు కూడా ఆయనతో కలిసి పని చేయను” అని పూజా తన దృఢ నిశ్చయాన్ని ప్రకటించింది.

పూజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ‘ఫ్యాన్ వార్స్’కు దారితీశాయి. సదరు హీరో సినిమా ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వడంతోనే ఈ పాత మేటర్ మళ్ళీ తెరపైకి వచ్చిందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.

పూజా ప్రస్తుతం నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రం సెన్సార్ వివాదాల వల్ల విడుదల వాయిదా పడింది. ఈ సినిమా వివాదంపై నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, మద్రాస్ హైకోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకోవాలని కోర్టు సూచించింది.

ఇటీవల పూజా నటించిన ఆచార్య, సర్కస్, కిసి కా భాయ్ కిసి కి జాన్, కూలీ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. వరుస డిజాస్టర్లు ఎదురైనప్పటికీ, అగ్ర హీరోల సరసన అవకాశాలను అందుకోవడంలో ఆమె సత్తా ఏమాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం ఆమె చేతిలో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’, ‘కాంచన 4’ మరియు దుల్కర్ సల్మాన్ 41వ సినిమా వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

వివాదాలు ఏవైనా, బుట్టబొమ్మ తన తర్వాతి సినిమాలతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కి తన పవరేంటో చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇంతకీ ఆ హీరో ఎవరు?
పూజా హెగ్డే చెంప పగలగొట్టిన ఆ పాన్ ఇండియా హీరో ఎవరు అనేది ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీగా మారింది. అయితే, పూజా ఈ వ్యాఖ్యలు నిజంగానే చేసిందా? లేక ఇవి కేవలం సోషల్ మీడియాలో పుట్టిన రూమర్లేనా? అనేది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. ఒకవేళ పూజా నిజంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే మాత్రం, ఆ హీరో పేరు బయటకు వస్తే ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగడం ఖాయం. అసలు నిజం తెలియాలంటే పూజా హెగ్డే స్పందించే వరకు వేచి చూడాల్సిందే
పూజా హెగ్డే చేసిన ఈ చెంప దెబ్బ వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఆ ‘పాన్ ఇండియా’ హీరో ఎవరు అనే మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ విషయంలో పూజా లేదా సదరు హీరో స్పందిస్తారేమో వేచి చూడాలి!

