మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ మూవీ ‘మెగా 158’ మీద బజ్ రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఎంట్రీ గురించి టాలీవుడ్‌లో హాట్ టాక్ నడుస్తోంది!

సమాచారం ప్రకారం, దర్శకుడు బాబీ కొల్లి మాళవికను కథకు సరిపోయే కీలక పాత్ర కోసం అప్రోచ్ చేశారట. చర్చలు కూడా జరుగుతున్నాయని ఫిలింనగర్ టాక్. ఈ చిత్రం KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.

నవంబర్ 5న గ్రాండ్‌గా పూజా కార్యక్రమం జరగనుంది. జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. పలు లొకేషన్స్‌లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు.

ఇక ప్రభాస్ తో ‘రాజా సాబ్’ లో హీరోయిన్‌గా నటిస్తున్న మాళవిక, ఇప్పుడు చిరంజీవి సినిమాకి సైన్ చేస్తే — అది టాలీవుడ్‌లో సెన్సేషన్ కాంబో అవుతుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

“ప్రభాస్ హీరోయిన్ – చిరంజీవి కాంబో సెట్ అవుతుందా?” అన్న సస్పెన్స్ ఇప్పుడు టాలీవుడ్ అంతా హీట్ పెంచేస్తోంది!

, , , ,
You may also like
Latest Posts from