నేషనల్ అవార్డ్ విన్నర్, ‘మహానటి’ కీర్తి సురేష్ గతేడాది గోవాలో తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్‌ని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చూడముచ్చటైన ఈ జంట పెళ్లి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే, ఈ పెళ్లి వెనుక ఎవరికీ తెలియని ఒక పెద్ద డ్రామా ఉందన్న విషయాన్ని కీర్తి తాజాగా బయటపెట్టింది. ఒక దశలో వీరు ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట!

15 ఏళ్ల ప్రేమ.. కానీ కులమతాల అడ్డుగోడ!

కీర్తి సురేష్, ఆంటోనీలు దాదాపు 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ వీరిద్దరి మతాలు వేరు కావడంతో, ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటారో లేదో అని ఈ జంట తీవ్ర ఆందోళన చెందారట. తన పెళ్లి కల నెరవేరదని కీర్తి ఒకానొక సమయంలో భయపడిందట.

“పారిపోదాం అనుకున్నాం..”

తాజా ఇంటర్వ్యూలో కీర్తి ఆ ఆందోళనకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ.. “మా ప్రేమను పెద్దలు అంగీకరించరని చాలా భయపడ్డాం. వేరే దారి లేక, పారిపోయి పెళ్లి చేసుకుందామని కూడా డిసైడ్ అయ్యాం. కానీ అదృష్టవశాత్తూ ఇరు కుటుంబాల పెద్దలు మా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది నా జీవితంలో అతిపెద్ద డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్” అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాళి కట్టేటప్పుడు అందుకే ఏడ్చాను!

పెళ్లి మండపంలో ఆంటోనీ తన మెడలో తాళి కట్టేటప్పుడు కీర్తి సురేష్ ఎమోషనల్ అయ్యి ఏడ్చేసింది. దానికి కారణం వివరిస్తూ.. “ఆ క్షణం వరకు మా పెళ్లి జరుగుతుందని నేను నమ్మలేకపోయాను. అందుకే తాళి కట్టగానే కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాను. ఆంటోనీ కూడా తన జీవితంలో మొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది మా లైఫ్ లోనే అత్యంత ఆనందకరమైన క్షణం” అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమాలతో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ సరసన “రౌడీ జనార్దన” సినిమాలో నటిస్తూ తన కెరీర్‌ను దూసుకుపోతోంది.

#indian actress, #keerthy suresh, #keerthy suresh marriage, #south actress, #The Shocking Truth

By admin