సినిమా వార్తలు

మోహన్ బాబు మిస్ బిహేవ్ చేస్తే చిరంజీవి సీన్ లోకి వచ్చారా, అసలేం జరిగింది?

పాత సినిమాల వెనుక ఎవరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన కథలు దాగి ఉంటాయి. తాజాగా సీనియర్ డైరెక్టర్ కె. బాపయ్య ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుల గురించి బయటపెట్టిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అసలు చిరంజీవికి ‘ఇంటి గుట్టు’ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది? అక్కడ జరిగిన డ్రామా ఏంటి?

ఆరోజు సెట్‌లో అసలేం జరిగింది?

‘ఇంటి గుట్టు’ సినిమా షూటింగ్ సమయం అది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ముందుగా మోహన్ బాబును ఎంపిక చేశారట. అయితే షూటింగ్ స్పాట్‌లో జరిగిన ఓ చిన్న గొడవ మొత్తం సీన్ మార్చేసింది.

బాపయ్య గారు మాట్లాడుతూ.. ఫస్ట్ మోహన్ బాబుతో మొదలుపెట్టి, అతను కొంచెం ఏదో మిస్ బిహేవ్ చేస్తే.. ఆ తర్వాత ఈయన్ని తీసేసి చిరంజీవిని తీసుకొని ఓకే కంప్లీట్ చేశాం. అంటే మిస్ బిహేవ్ అంటే మీతో గొడవ అయిందా ఏమన్నా? అని యాంకర్ అడగగా..కె. బాపయ్య ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ…గొడవ అంటే పెద్దదేం కాదు..మోహన్ బాబు ఆ రోజు షూటింగ్ కి వచ్చాడు. వెయిట్ చేయమన్నాము. ఎందుకంటే సత్యనారాయణతో లోపల సీన్ చేస్తున్నాము. అతనికి ఫీవరిష్ గా ఉంది. అందుకని అతని సీన్ మొత్తం కంప్లీట్ చేసి ఇతనితో మొదలు పెట్టాలని చెప్పాము. చెప్పినా కూడా వెయిట్ చేసి ‘ఆ వెళ్ళిపోతున్నాను’ అన్నాడు.

మోహన్ బాబు అవుట్.. చిరంజీవి ఇన్!

దర్శకుడు అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ కదా.. మోహన్ బాబు అలా వెళ్ళిపోవడంతో బాపయ్య గారు సీరియస్ అయ్యారట. “వెళ్లిపోతే వెళ్ళిపోనివ్వండి, రేపు వేరే వాళ్లను తీసుకుందాం” అని చెప్పి, మరుసటి రోజే ఆ ప్లేస్‌లో చిరంజీవిని తీసుకున్నారట. అలా మోహన్ బాబు మిస్ చేసుకున్న ఆ ఛాన్స్ చిరంజీవి తలుపు తట్టింది. మిగతా ఆర్టిస్టులు కన్విన్స్ చేయడంతో చిరంజీవిని ఫైనల్ చేశారట.

చిరులోని స్పార్క్ అప్పుడే చూశా!

చిరంజీవి నటన గురించి బాపయ్య గారు మాట్లాడుతూ.. “అప్పట్లోనే ఆయన ఎక్స్‌ప్రెషన్స్, మాడ్యులేషన్, ఫైట్స్ చూస్తే అర్థమైపోయేది.. ఇతను పెద్ద స్టార్ అవుతాడని. డాన్స్, ఫైట్స్ ఇరగదీసేవాడు” అంటూ మెగాస్టార్ పై ప్రశంసలు కురిపించారు.

అన్నయ్యతో పోటీ ఉండేదా?

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, బాపయ్య అన్నదమ్ములు అన్న విషయం తెలిసిందే. “మీ ఇద్దరి మధ్య పోటీ ఉండేదా?” అని అడిగితే.. “పోటీ ఏం లేదు, నేను ఒక సినిమా ఇక్కడ చేసి వెంటనే బొంబాయి (బాలీవుడ్) వెళ్లిపోయేవాడిని. జ్యోతి సినిమా నేనే చేయాల్సింది, కానీ నా సినిమా ఒకటి ఫ్లాప్ అవ్వడంతో అది రాఘవేంద్రరావు గారికి వెళ్ళింది” అని చెప్పుకొచ్చారు.

మొత్తానికి మోహన్ బాబు ఆరోజు చూపించిన చిన్న అలక.. చిరంజీవి కెరీర్‌లో ఒక మంచి సినిమా పడేలా చేసింది. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఇంత.. ఎప్పుడు ఎవరి జాతకం మారుతుందో ఎవరికీ తెలియదు!

Similar Posts