టాలీవుడ్‌లో సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి చాలా కామన్. కానీ, కొన్నిసార్లు అతివిశ్వాసం కొంపముంచుతుందని దర్శకుడు మారుతి (Director Maruthi) విషయంలో రుజువవుతోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ప్రభాస్ (Prabhas) చిత్రం ‘ద రాజాసాబ్’ (The Raja Saab) ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఫ్యాన్స్ ఆగ్రహం ఇప్పుడు మారుతి వ్యక్తిగత జీవితంపై పడింది.

అడ్రస్ ఇచ్చి మరీ చిక్కుల్లో..
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మారుతి తన సినిమాపై ఉన్న నమ్మకంతో ఏకంగా తన ఇంటి అడ్రస్‌ను బహిరంగంగా ప్రకటించారు. అప్పట్లో అది కాన్ఫిడెన్స్ అనుకున్నా, ఇప్పుడు అదే ఆయనకు పెద్ద శాపంగా మారింది. సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో, కోపంతో ఉన్న అభిమానులు మారుతి ఇంటికి వందల సంఖ్యలో ‘క్యాష్ ఆన్ డెలివరీ’ (Cash on Delivery) ఆర్డర్లు పంపిస్తూ చుక్కలు చూపిస్తున్నారు.

హౌసింగ్ సొసైటీలో రచ్చ!
నిరంతరాయంగా వస్తున్న ఈ ఫేక్ ఆర్డర్ల వల్ల మారుతి కుటుంబమే కాకుండా, ఆయన ఉంటున్న హౌసింగ్ సొసైటీ మొత్తం ఇబ్బందుల్లో పడింది. డెలివరీ బాయ్స్ తాకిడికి గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ కూడా తలపట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ ఒకెత్తు అయితే, ఇలా పర్సనల్ అడ్రస్‌ను టార్గెట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. మారుతి చేసిన ఈ చిన్న పొరపాటు ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది.

#director maruthi, #Maruthi, #Prabhas, #prabhas fans, #The Raja Saab, #trolling

By admin