
రజినీకాంత్ షాకింగ్ నిర్ణయం! గన్ పక్కన పెట్టేసిన తలైవా…అసలు కారణం ఇదేనా?
ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ‘జైలర్’, ‘వేట్టయన్’ వంటి సినిమాల్లో గన్ పట్టి శత్రువుల వేట సాగించిన తలైవా.. ఇప్పుడు రక్తపాతానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. తన 173వ సినిమాలో రజినీకాంత్ ఒక సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. అదేంటో తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే!
మళ్ళీ వింటేజ్ కామెడీ రజినీ వచ్చేస్తున్నాడు!
దర్శకుడు సిబి చక్రవర్తి (డాన్ ఫేమ్) ‘తలైవర్ 173’ గురించి ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో రజినీకాంత్ ఎటువంటి హింస లేని, ఫ్యూర్ కామెడీ అండ్ మాస్ రోల్ లో కనిపించబోతున్నారట.
క్లాసిక్ మ్యాజిక్: 90వ దశకంలో రజినీకాంత్ తన మేనరిజమ్స్, కామెడీ టైమింగ్‌తో ఎలాగైతే అలరించారో.. మళ్ళీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతున్నారు.
షూటింగ్ ఎప్పుడు?: ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుండి ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్‌ను స్వయంగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తుండటం విశేషం.
లోకేష్ కనగరాజ్ అందుకే తప్పుకున్నారా?
నిజానికి రజినీకాంత్ ఒక లైట్ హార్టెడ్ కామెడీ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈ విషయంపై గతంలో లోకేష్ కనగరాజ్ దగ్గర కూడా ప్రస్తావించారట. అయితే, లోకేష్ స్టైల్ పూర్తిగా యాక్షన్ అండ్ వైలెన్స్ కావడంతో, కామెడీ సినిమా తన వల్ల కాదని ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అలాగే దర్శకుడు సుందర్ సి తో కూడా చర్చలు జరిగాయి కానీ చివరికి సిబి చక్రవర్తి ఈ ఛాన్స్ కొట్టేశారు.
రజినీ నిర్ణయం వెనుక కారణం ఏంటి?
వరుసగా యాక్షన్ సినిమాలు చేయడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వకూడదని, అలాగే చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇవ్వాలని రజినీ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇది ఒక రకంగా తలైవా ఫ్యాన్స్‌కు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి.
మొత్తానికి తలైవా తన రూటు మార్చి మళ్ళీ ‘ముత్తు’, ‘అరుణాచలం’ వంటి వింటేజ్ డేస్ ను గుర్తు చేయబోతున్నారు. ఏప్రిల్ లో మొదలయ్యే ఈ కామెడీ అడ్వెంచర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి!
