సినిమా వార్తలు

ప్రభాస్ ‘రాజా సాబ్’ దెబ్బ.. ఆ ముగ్గురు హీరోయిన్ల కెరీర్ క్లోజ్? మారుతి చేసిన పనికి అంతా అయోమయం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, అందులో నటించిన హీరోయిన్ల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. రెండేళ్లకు పైగా ఈ ప్రాజెక్ట్ కోసం వేరే సినిమాలను కాదనుకుని మరీ వెయిట్ చేసిన ఆ ముగ్గురు భామలు ఇప్పుడు ఆఫర్లు లేక తలలు పట్టుకుంటున్నారు.

రాజా సాబ్ నమ్మకాన్ని వమ్ము చేశాడా?

దర్శకుడు మారుతి (Maruthi) తెరకెక్కించిన ఈ హారర్ కామెడీపై హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్‌లో తమ జాతకాలు మారిపోతాయని భావించారు. కానీ సినిమా ఫలితం తారుమారు కావడంతో వీరి ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి.

మాళవిక మోహనన్ (Malavika Mohanan): టాలీవుడ్ ఎంట్రీ ఘోరంగా..

    బాలీవుడ్, మాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న మాళవిక మోహనన్, ‘రాజా సాబ్’ సినిమాతో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంది. అందుకే ఈ సినిమా విడుదలయ్యే వరకు కొత్త తెలుగు ప్రాజెక్టులు ఏవీ సైన్ చేయలేదు. కానీ ఇప్పుడు డెబ్యూ సినిమానే డిజాస్టర్ కావడంతో, టాలీవుడ్ మేకర్స్ ఆమె వైపు చూడటానికి వెనకాడుతున్నారు.

    నిధి అగర్వాల్ (Nidhhi Agerwal): ఐరన్ లెగ్ ముద్ర తప్పదా?

      నిధి అగర్వాల్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడో వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత అన్ని ఆశలు ‘రాజా సాబ్’ మీదే పెట్టుకుంది. ఈ సినిమా కోసం ఆమె చాలా క్రేజీ ఆఫర్లను రిజెక్ట్ చేసింది. ఇప్పుడు చేతిలో ఉన్న ఒకే ఒక్క పెద్ద సినిమా కూడా ఫ్లాప్ కావడంతో నిధి కెరీర్ ప్రమాదంలో పడింది.

      రిద్ధి కుమార్ (Riddhi Kumar): అదృష్టం అందని ద్రాక్షేనా?

        పెద్దగా గుర్తింపు లేని రిద్ధి కుమార్, ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోతానని కలలు కన్నది. ప్రభాస్ పక్కన ఛాన్స్ రావడమే గొప్ప అనుకున్నా, సినిమా రిజల్ట్ ఆమెకు ఏమాత్రం ప్లస్ అవ్వలేదు. రెండేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.

        Similar Posts