
షారూఖ్ భార్య అని భయంతోనే ఓకే చెప్తున్నారా? గౌరీ ఖాన్ ‘ఇంటీరియర్’ వెనుక ఉన్న షాకింగ్ నిజాలు!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ భార్యగా గౌరీ ఖాన్ (Gauri Khan) అందరికీ పరిచయమే. కానీ ఆమె ఒక సక్సెస్‌ఫుల్ ఇంటీరియర్ డిజైనర్ కూడా. అయితే, ఇప్పుడు ఆమె డిజైనింగ్ టాలెంట్‌పై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఆమె డిజైన్లు అద్భుతమా? లేక కేవలం కింగ్ ‘ఖాన్’ అన్న పేరు చూసి సెలబ్రిటీలు ఆమెకు కోట్లు తగలేస్తున్నారా? అనే చర్చ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సెలబ్రిటీల భయం.. గౌరీ వాలిడేషన్ కోసం ఆరాటం!
బాలీవుడ్ స్టార్స్ గౌరీ ఖాన్‌తో ఇళ్లను డిజైన్ చేయించుకోవడానికి కారణం ఆమె టాలెంట్ కాదని, ఆమె పవర్ అని కొందరు విమర్శిస్తున్నారు. ఒకవేళ గౌరీకి పని ఇవ్వకపోతే, ఆమెకు కోపం వస్తుందని, తద్వారా షారూఖ్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ దృష్టిలో పడకూడదని చాలామంది భయం భయంగా ఆమెకే ఆర్డర్లు ఇస్తున్నారట. ముఖ్యంగా ‘బాలీవుడ్ వైఫ్స్’ షోలో గౌరీ ఎంట్రీ ఇచ్చినప్పుడు మిగిలిన స్టార్ భార్యలు ఆమెను పొగిడే విధానం చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కత్రినా కైఫ్ టెర్రస్.. వర్షం వస్తే సోఫాల గతేంటి?
గౌరీ ఖాన్ చేసిన డిజైన్లలో అత్యంత విమర్శలు పాలైనది కత్రినా కైఫ్ టెర్రస్. ఓపెన్ టెర్రస్‌ను లివింగ్ రూమ్‌లా మార్చేసిన గౌరీ, అక్కడ ఖరీదైన సోఫాలు, కుషన్లు పెట్టింది. “ముంబైలో వర్షం పడితే ఆ సోఫాల పరిస్థితి ఏంటి గౌరీ?” అంటూ నెటిజన్లు ఆమె ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను ప్రశ్నిస్తున్నారు. కేవలం చూడటానికి బాగుంటే సరిపోదని, అది వాడుకోవడానికి కూడా వీలుగా ఉండాలని హితవు పలుకుతున్నారు.
జాక్వెలిన్ బెడ్‌రూమ్: కొత్త ఫర్నిచర్ పెడితే డిజైనింగ్ అయిపోతుందా?
నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెడ్‌రూమ్‌ను కూడా గౌరీనే డిజైన్ చేసింది. కానీ ఆ గది మధ్యలో టీవీని పెట్టిన తీరు చూసి అంతా నోరెళ్లబెట్టారు. గదిని అందంగా మార్చడం పక్కన పెడితే, ఉన్న స్పేస్‌ను కూడా సరిగ్గా వాడుకోలేదని, కేవలం లక్షల రూపాయల ఫర్నిచర్ కొని ఒక గదిలో పడేస్తే అది డిజైనింగ్ ఎలా అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ధరలు వింటే గుండె ఆగిపోవాల్సిందే!
గౌరీ ఖాన్ స్టోర్‌లో లభించే వస్తువుల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటాయి.
ఒక సాధారణ సైడ్ టేబుల్ ల్యాంప్ ధర రూ. 85,000!
ఒక సోఫా సెట్ ధర ఏకంగా రూ. 7.5 లక్షల నుండి మొదలవుతుంది. కానీ, ఈ డిజైన్ల వెనుక గౌరీ కష్టం కంటే ఆమె టీమ్ కష్టమే ఎక్కువగా ఉంటుందని, ఆమె కేవలం తన బ్రాండ్ పేరును మాత్రమే వాడుకుంటుందని ఇండస్ట్రీ టాక్.
ప్రియాంక చోప్రాను తొక్కేయాలని చూశారా?
గౌరీ ఖాన్ కేవలం డిజైనింగ్‌లోనే కాదు, బాలీవుడ్ పాలిటిక్స్‌లోనూ చాలా పవర్‌ఫుల్ అని చెబుతుంటారు. గతంలో ప్రియాంక చోప్రాను బాలీవుడ్ నుండి దూరం చేయడంలో గౌరీ, కరణ్ జోహార్ కీలక పాత్ర పోషించారని సోషల్ మీడియాలో ప్రచారం ఉంది. ప్రియాంకకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారని, అందుకే ఆమె హాలీవుడ్‌కు వెళ్లాల్సి వచ్చిందని నెటిజన్లు ఆరోపిస్తుంటారు.
