మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫోటోలో ఆయన ఎడమ చేతికి హ్యాండ్ సపోర్ట్ బెల్ట్ (Hand Belt) వేసుకుని ఉండటంతో మెగా అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అసలు బాస్‌కు ఏమైంది? ఏదైనా ప్రమాదం జరిగిందా? అని ఆందోళన చెందుతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి పిలుపులో బయటపడ్డ గాయం!

అల్లు అరవింద్ రెండో కుమారుడు, నటుడు అల్లు శిరీష్ (Allu Sirish) వివాహం మార్చి 6న జరగనుంది. ఈ క్రమంలో తొలి పెళ్లి శుభలేఖను అల్లు అరవింద్ దంపతులు, శిరీష్ కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లి అందజేశారు. సాంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అందులో చిరంజీవి ఎడమ చేతికి కట్టు కనిపించింది. దీంతో అప్పటివరకు పెళ్లి సందడిలో ఉన్న ఫ్యాన్స్ దృష్టి కాస్తా చిరంజీవి ఆరోగ్యం వైపు మళ్ళింది.

భుజానికి సర్జరీ.. అందుకే ఆ బెల్ట్!

అందుతున్న సమాచారం ప్రకారం.. చిరంజీవి భుజానికి (Shoulder) సంబంధించి గత నెలలో ఒక చిన్న సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సర్జరీ నుంచి ఆయన కోలుకుంటున్నారు. భుజంపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు, నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యుల సూచన మేరకు చిరంజీవి ఈ హ్యాండ్ సపోర్ట్ బెల్ట్‌ను వాడుతున్నారట.

నొప్పి ఉన్నా.. అభిమానుల కోసం సెల్ఫీలు!

ఇటీవల చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జరిగిన అభిమానుల సమావేశానికి కూడా ఆయన ఇదే కట్టుతో హాజరయ్యారు. అయితే, తనను చూడటానికి వచ్చిన అభిమానులను నిరాశపరచకూడదని.. భుజం నొప్పి వేధిస్తున్నప్పటికీ ఆ బెల్ట్ తీసి వారితో సెల్ఫీలు దిగి తన పెద్ద మనసును చాటుకున్నారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్ మరియు ఇతర పనుల్లో బిజీగా ఉన్న ఆయన, త్వరలోనే పూర్తిగా కోలుకుని మళ్ళీ మాస్ లుక్‌లో కనిపిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

#Allu Sirish, #Chiranjeevi, #Hand Bandage, #Hand Belt, #Shoulder Injury

By admin