సినిమా వార్తలు

తెలంగాణ మటన్ బిర్యానీ.. కూర్గ్ పోర్క్ కర్రీ! విరోష్ పెళ్లిలో విందు భోజనం మెనూ లీక్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ఉదయ్‌పూర్ కోట సాక్షిగా, ఆరావళి కొండల నడుమ టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న (Virosh) ఒక్కటయ్యారు. సరిగ్గా ఈరోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు మేళతాళాల నడుమ రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. అయితే, ఈ రాయల్ వెడ్డింగ్‌లో పెళ్లి తంతు ఒకెత్తు అయితే.. అక్కడ వడ్డించిన విందు భోజనం మరో ఎత్తు. అతిథుల మైండ్ బ్లాక్ అయ్యేలా ప్లాన్ చేసిన ఆ ‘రాజ భోజనం’ వివరాలు ఇవే!

10:10కి మూడు ముళ్లు.. ఆ వెంటనే అదిరిపోయే విందు!

ఐటీసీ మెమెంటోస్ హోటల్‌లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో, ముహూర్తం ముగియగానే అతిథుల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ మెనూ హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ పక్కా తెలంగాణ బిడ్డ కావడం, రష్మిక కర్ణాటకకు చెందిన ‘కొడవ’ అమ్మాయి కావడంతో.. ఈ విందులో రెండు రాష్ట్రాల రుచులు పోటీ పడ్డాయి.

మెనూలోని హైలైట్స్ ఇవే:

తెలంగాణ మటన్ బిర్యానీ: విజయ్ తన మూలాలను మర్చిపోకుండా, అతిథుల కోసం ఘుమఘుమలాడే తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీని ప్రత్యేకంగా చేయించారు. స్పైసీగా ఉండే నాటు కోడి పులుసు, చికెన్ వేపుడు ఐటమ్స్ విందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

కూర్గ్ స్టైల్ పోర్క్ కర్రీ: రష్మిక పుట్టిన ఊరు కూర్గ్ (కొడవ) సంప్రదాయం ప్రకారం, వారి పెళ్లి విందులో అత్యంత ముఖ్యమైన ‘పోర్క్ కర్రీ’ (పంది మాంసం కూర) ని స్పెషల్‌గా వడ్డించారు. ఈ వంటకం లేకపోతే కొడవ పెళ్లి విందు పూర్తి కానట్టే.

బిసిబేళా బాత్ & డెసెర్ట్స్: కర్ణాటక స్పెషల్ బిసిబేళా బాత్‌తో పాటు, రాజస్థానీ రాయల్ స్వీట్లు మరియు తెలంగాణ స్పెషల్ డెసెర్ట్స్ అతిథుల నోటిని తీపి చేశాయి.

రాయల్ సెటప్‌లో రాజభోగం!

ఒక్కో గది రెంట్ రాత్రికి రూ. 70 వేల వరకు ఉన్న ఈ లగ్జరీ రిసార్ట్‌లో, ‘VIROSH’ అనే ఎంబ్రాయిడరీ చేసిన టేబుల్స్ మీద ఈ వంటకాలను వడ్డించారు. తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా వంటి సెలబ్రిటీ దర్శకులు కూడా ఈ రాయల్ విందును ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. అచ్చమైన తెలుగింటి భోజనం నుండి ఇంటర్నేషనల్ కుషన్స్ వరకు ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేశారు.

10:10 గంటల శుభ ముహూర్తాన పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట, తమ అతిథుల కడుపు నింపడంలోనూ ‘రౌడీ’ మార్క్ చూపించారు. తెలంగాణ మటన్ బిర్యానీ ఘుమఘుమలతో ఉదయ్‌పూర్ కోట దద్దరిల్లిపోయింది. ఇక మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణాలో జరిగే రిసెప్షన్‌లో మరెన్ని వెరైటీలు ఉంటాయో అని ఫుడ్ లవర్స్ ఇప్పుడే ఆరా తీస్తున్నారు!

Similar Posts