సినిమా వార్తలు

ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో మళ్ళీ IMAX? ప్రీతమ్ డేనియల్ ట్వీట్ వెనుక అసలు గుట్టు ఇదే!

హైదరాబాద్ సినీ లవర్స్ కల నెరవేరబోతుందా? ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడనుందా? IMAX వైస్ ప్రెసిడెంట్ ప్రీతమ్ డేనియల్ తాజాగా సిటీలో ల్యాండ్ అవ్వడంతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. ఇది ఊరికే వచ్చిన విజిట్ కాదు, దీని వెనుక ఒక భారీ స్కెచ్ ఉందంటూ వార్తలు హోరెత్తుతున్నాయి!

హైదరాబాద్ అంటేనే సినిమా పిచ్చికి కేరాఫ్ అడ్రస్. కానీ మన భాగ్యనగరంలో ఒక ప్రాపర్ IMAX స్క్రీన్ లేకపోవడం పక్కా సినీ అభిమానులకు ఒక పెద్ద వెలితిగా మారింది. ఎప్పుడు ఏ భారీ సినిమా వచ్చినా బెంగళూరో, చెన్నైకో వెళ్లాల్సిన పరిస్థితి. అయితే, తాజాగా IMAX థియేటర్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రీతమ్ డేనియల్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది.

హైదరాబాద్ ఫుడ్ అంటే ఇష్టం.. మరి స్క్రీన్ సంగతేంటి?

ప్రీతమ్ డేనియల్ తన ‘X’ ఖాతాలో హైదరాబాద్ పిక్చర్‌ను షేర్ చేస్తూ.. “ఈ నగరం, ఇక్కడి ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం” అంటూ ఒక చిన్న పోస్ట్ పెట్టారు. ఈ ఒక్క ట్వీట్‌తో ఇండస్ట్రీలో సెన్సేషన్ మొదలైంది. థియేటర్ డెవలప్‌మెంట్ హెడ్ ఊరికే హైదరాబాద్ రారు కదా, పక్కాగా మన సిటీకి మళ్ళీ IMAXను తీసుకొచ్చే ప్లాన్లలోనే ఆయన ఉన్నారని ఫిలిం నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

వారణాసి కోసం మాస్ వెయిటింగ్:

ముఖ్యంగా రాబోయే భారీ చిత్రం ‘వారణాసి’ని IMAX ఫార్మాట్‌లోనే చూడాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ విజువల్ వండర్‌ను ఎక్స్ పీరియన్స్ చేయాలంటే ఒక పవర్ ఫుల్ స్క్రీన్ కావాలి. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ మళ్ళీ పాత వైభవాన్ని సంతరించుకుంటుందా? లేక కొత్త ప్లేస్‌లో అల్ట్రా మోడరన్ IMAX రాబోతుందా? అన్నది ఇప్పుడు సస్పెన్స్.

అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర గూస్ బంప్స్ రావడం పక్కా. ఒకవేళ హైదరాబాద్‌కు IMAX వస్తే మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తారు?

Similar Posts