సినిమా వార్తలు

దళపతి ఫ్యాన్స్‌కు మరో షాక్: 500 కోట్ల సినిమా చిక్కుల్లో.. రిలీజ్ డౌటేనా?

దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. ఎప్పుడెప్పుడు థియేటర్లలో బొమ్మ పడుతుందా అని వెయ్యి కళ్లతో చూస్తున్న అభిమానుల ఆశలపై సెన్సార్ బోర్డ్ నీళ్లు చల్లింది. అసలు ‘జన నాయకన్’కు లైన్ క్లియర్ అయ్యేలా కనిపించడం లేదు.

వివరాల్లోకి వెళితే..

జనవరి 9నే సందడి చేయాల్సిన ఈ సినిమా, సెన్సార్ చిక్కుల్లో పడి వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మేకర్స్ కోర్టు మెట్లు ఎక్కినా ఫలితం లేకుండా పోయింది. సినిమాను రివైజింగ్ కమిటీకి పంపినా, మార్చి 17న జరగాల్సిన స్క్రీనింగ్ కూడా నిలిచిపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

అసలు గొడవ ఎక్కడ?:

ఈ సినిమాలో ఉన్న కొన్ని పొలిటికల్ డైలాగ్స్, మతపరమైన అంశాలు, మిలిటరీ సీన్లు సెన్సార్ బోర్డును కలవరపెడుతున్నాయి. ఇవి వివాదాస్పదంగా మారతాయన్న ఉద్దేశంతో బోర్డ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మొదట U/A సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ, ఎవరో ఫిర్యాదు చేయడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. నేడు జరగాల్సిన రివైజింగ్ కమిటీ రివ్యూ కూడా వాయిదా పడటంతో అభిమానుల సహనం నశిస్తోంది.

ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ లో రావడం కూడా కష్టమేనని తెలుస్తోంది. అన్ని అడ్డంకులు తొలగి సెన్సార్ క్లియరెన్స్ వస్తే, ‘జన నాయకన్’ ఏకంగా మే 2026లో థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న తరుణంలో విజయ్ సినిమాకు ఇలాంటి అడ్డంకులు ఎదురవ్వడం వెనుక ఏదైనా రాజకీయం ఉందా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. మరి ఈ ‘జన నాయకన్’ ఆటంకాలన్నీ దాటుకుని బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు గర్జిస్తాడో చూడాలి.

Similar Posts