తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక సినిమా గురించి రివ్యూ ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు. తాజాగా విడుదలైన ‘ధురంధర్ ది రివేంజ్’ సినిమాను చూసిన జక్కన్న, తనదైన శైలిలో ఇచ్చిన టెర్రిఫిక్ ఎనాలసిస్ ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది. అసలు రాజమౌళి ఏమన్నారో తెలిస్తే ఈ సినిమాపై మీ అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం!

4 గంటల సినిమా.. అయినా సీట్లలోంచి కదల్లేరు!
సాధారణంగా రెండున్నర గంటల సినిమాకే బోర్ ఫీలయ్యే రోజులివి. కానీ దర్శకుడు ఆదిత్య ధర్ ఏకంగా 4 గంటల నిడివితో ‘ధురంధర్ 2’ని తెరకెక్కించి సాహసమే చేశారు. దీనిపై స్పందించిన రాజమౌళి.. “4 గంటల సినిమా తీయడానికి దమ్ముండాలి, చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకుడు సీటుకు అతుక్కుపోయేలా చేయడంలో ఆదిత్య సక్సెస్ అయ్యారు” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఆత్మలోనూ, ఆకృతిలోనూ అసలైన సినిమాను మించిపోయిందని జక్కన్న కితాబిచ్చారు.
రణ్‌వీర్ సింగ్ – మాధవన్ ల యాక్టింగ్ ‘మాస్టర్ క్లాస్’!
I loved Dhurandhar-1, but The Revenge surpassed the original in both scale and soul.
— rajamouli ss (@ssrajamouli) March 21, 2026
The writing, casting, technical execution, music, world design and direction are flawless…. But it’s the emotional stakes that really ground it.
The writing manages to weave plot twists that…
ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ నటనను చూసి రాజమౌళి ఫిదా అయిపోయారు. ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ సీన్ లో రణ్‌వీర్ పండించిన హావభావాలు అద్భుతమని కొనియాడారు. ఇక మాధవన్ గారి నటన దేశం యొక్క నిస్సహాయతను కళ్లకు కట్టినట్లు చూపిందని, ఆయన విజయాన్ని ప్రతి ఒక్కరూ తమ విజయంగా ఫీల్ అవుతున్నారని రాజమౌళి పేర్కొన్నారు. టెక్నికల్ గా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉందని, క్లైమాక్స్ గుండెల్ని పిండేస్తుందని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
నార్త్ బ్యాచ్ సైలెంట్.. సౌత్ మాత్రం సెలబ్రేషన్స్!
ఇంతటి భారీ విజయం సాధించినా, టాలీవుడ్ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నా.. ముంబై బ్యాచ్ మాత్రం ఇంకా సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా, రాజమౌళి లాంటి మేధావి నుంచి వచ్చిన ఈ ఎనాలసిస్ ‘ధురంధర్ 2’ టీమ్ కి కొండంత బలాన్ని ఇచ్చింది.

