బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ మేనియా పనిచేయలేదా? ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్లు చూస్తుంటే ట్రేడ్ వర్గాల్లో వణుకు మొదలైంది. ఒకవైపు హిందీ సినిమా ‘ధురంధర్ 2’ సునామీ సృష్టిస్తుంటే, మరోవైపు పవన్ సినిమా నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడుతోంది!
గత వారాంతంలో విడుదలైన సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్‌ను విశ్లేషిస్తూ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. హిందీ సినిమా ‘ధురంధర్ 2’తో అనవసరంగా క్లాష్ పెట్టుకోవడం ‘ఉస్తాద్’కు కొంపముంచేలా మారింది. అటు నార్త్ ఇండియాలో మాత్రమే కాకుండా, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ సినిమాను ‘ధురంధర్’ దాటేయడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

బాక్సాఫీస్ లెక్కల ప్రకారం చూస్తే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రతి ఏరియాలో 50% నుండి 70% వరకు భారీ నష్టాలను మూటగట్టుకునే దిశగా వెళ్తోంది. నైజాంలో సుమారు ₹45 కోట్ల బిజినెస్ జరిగితే, మొదటి వీకెండ్‌లో కేవలం ₹12.5 కోట్లతోనే సరిపెట్టుకుంది. ఇక సీడెడ్, ఆంధ్రాలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాకు హరిహర వీరమల్లు కంటే తక్కువ కలెక్షన్లు రావడం ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఓవర్సీస్‌లో అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే 3 మిలియన్ డాలర్లు రావాలి, కానీ ప్రస్తుతం వస్తున్న వసూళ్లు చూస్తుంటే అది అసాధ్యమనిపిస్తోంది.
మరోవైపు ‘ధురంధర్ 2’ తెలుగు రాష్ట్రాల్లో కేవలం నాలుగు రోజుల్లోనే ₹35.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరి అంచనాలను తలకిందులు చేసింది. రణ్‌వీర్ సింగ్ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ డిలే అయినా సరే, థియేటర్ల వద్ద జనం క్యూ కడుతున్నారు. ఈ భారీ నష్టాల నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ రంగంలోకి దిగారు. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను, బయర్లను తామే ఆదుకుంటామని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని మైత్రి నవీన్ గారు గట్టి భరోసా ఇచ్చారు. గతంలో ‘రాబిన్ హుడ్’ నష్టాలను కూడా భరించిన చరిత్ర ఉన్న మైత్రి, ఇప్పుడు ‘ఉస్తాద్’ భారాన్ని కూడా నెత్తిన వేసుకునేందుకు సిద్ధమైంది.

హిట్ కాంబినేషన్, భారీ హైప్ ఉన్నా కూడా ‘ఉస్తాద్’ ఎందుకు వెనుకబడిందనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. టికెట్ రేట్ల పెంపు, కంటెంట్‌లో లోపం లేదా ‘ధురంధర్’ క్రేజ్.. ఇందులో ఏది పవన్ సినిమాను ముంచేసింది? ఏది ఏమైనా మైత్రి బ్యానర్ మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ల పాలిట దైవంగా మారిందని చెప్పొచ్చు. ఈ భారీ నష్టాలపై మీ కామెంట్ ఏంటి? ‘ఉస్తాద్’ కమ్ బ్యాక్ ఇస్తుందా? కింద తెలియజేయండి!

